దాదాపు 7 సంవత్సరాల అనంతరం వీరిద్దరూ కలసి చేస్తున్న చిత్రమిది కావడం ఓ విశేషం. ఇందులో అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు..రకుల్ ప్రీత్ సింగ్, అంగీరా ధార్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో పూజా కార్యక్రమాల అనంతరం తీసిన మొదటి సన్నివేశానికి అజయ్ దేవగణ్ మిత్రుడు, తెలుగు జ్యోతిష్కుడు బాలు మున్నంగి క్లాప్ నిచ్చారు.
ఈ సందర్భంగా అజయ్ దేవగణ్ స్పందిస్తూ, ‘‘ఈ చిత్రం రెగ్యులర్ షూటింగును కూడా ఈ రోజే మొదలు పెట్టాం. సినిమా పూర్తయ్యేవరకు నిరవధికంగా చిత్రీకరణ జరుపుతాం దేవుళ్ళ తో పాటు మా పేరెంట్స్ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నా. ఏప్రిల్ 29, 2022లో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నా’’ అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: అశీమ్ బజాజ్, సహ నిర్మాతలు: కుమార్ మంగత్, విక్రాంత్ శర్మ, హస్నైన్ హుస్సేని, జయ్ కనుజియా, తార్‌లోక్ సింగ్, సందీప్ కెవ్లాని, నిర్మాణం, దర్శకత్వం: అజయ్ దేవగణ్.
Must Read ;- సలార్’ కోసం ఆడిషన్స్ .. ఎవరైనా ట్రై చేయొచ్చునట!