ఎం.ఎస్.రాజు.. ఈ పేరు వింటే ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అనే వారు. ఆయన సినిమా తీస్తే.. బొమ్మ హిట్టే. అందులో ఎలాంటి సందేహం ఉండేది కాదు. ఆయన నిర్మించిన శత్రువు, దేవి, ఒక్కడు, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం.. తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. ఆతర్వాత ఆయన తీసిని సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. అంతే.. ఆయనకున్న క్రేజ్ తగ్గింది. అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. సక్సస్ కోసం తపిస్తూనే ఉన్నారు కానీ.. సక్సస్ మాత్రం రావడం లేదు.
ఆయన డైరక్షన్ లోకి ఎంట్రీ ఇచ్చి వాన సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా కన్నడ సినిమాకి రీమేక్. అక్కడ సక్సస్ అయ్యింది కానీ.. ఇక్కడ సక్సస్ సాధించలేదు. దర్శకుడిగా మరో ప్రయత్నం చేస్తున్నారు. అదే ‘డర్టీహరి’. ఈ చిత్రం ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎందుకంటే.. ఈ మూవీ టైటిల్ లో చెప్పినట్టుగా అడల్ట్ కంటెంట్ తో రూపొందుతోంది. ఈ మూవీ ట్రైలర్ యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. అయితే.. ఈ సినిమాని ఫ్రైడే మూవీస్ యాప్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. దీనిని ఈనెల 18న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఇప్పటి వరకు ఆయనకున్న ఇమేజ్ ను పక్కనపెట్టి ఈ సినిమా తీసారు. కొంతమందైతే.. సక్సస్ కోసం ఎం.ఎస్.రాజు ‘డర్టీహరి’ సినిమా తీశారా అంటున్నారు. ఆయన మాత్రం అలాంటివి ఏమీ పట్టించుకోకుండా ఈ సినిమా తీసారు. ఖచ్చితంగా యూత్ కి బాగా నచ్చుతుంది.. దర్శకుడిగా తనకి విజయాన్ని అందిస్తుంది అని గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి.. రాజు గారి దశ ఈ సినిమాతో అయినా తిరుగుతుందో లేదో చూడాలి.
Must Read ;- సిల్క్ స్మిత పాత్రలో అందాల అనసూయ?