అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కరోనా కారణంగా షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. దాదాపు ఏడు నెలల తర్వాత షూటింగ్ తిరిగి మొదలై శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటుగా మరో హీరోయిన్ కూడా నటిస్తోంది. ఆమె ఎవరో కాదు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘మెహబూబా’ సినిమా హీరోయిన్ నేహా శెట్టి. ఈ బెంగళూర్ భామ తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం ఆమె రెండు సినిమాలలో నటిస్తోంది. అందులో ఒకటి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. ఈమధ్యనే నేహా షూటింగ్ లో జాయిన్ అయ్యిందని సమాచారం. ఇందులో నేహా శెట్టి ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోందని, కథను మలుపు తిప్పే పాత్ర అని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్. త్వరలోనే ఆమె పాత్రకు సంబంధించిన విషయాలను రివీల్ చేస్తారని సమాచారం. తన కెరియర్ ప్రారంభం నుండి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు అఖిల్. అలాగే తమ అభిమాన హీరో తనయుడు సాలిడ్ హిట్ కొట్టాలని అక్కినేని అభిమానులు కూడా ఎప్పటినుండో కోరుకుంటున్నారు. ఆ కోరిక ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో తీరనున్నదని టాక్ నడుస్తోంది.
అఖిల్ ఈ సినిమాతో మంచి విజయం సాదించబోతున్నాడని చిత్ర బృందం ఇప్పటికే తెలిపింది. సినిమాపై మొదటి నుండి టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈమధ్యనే రిలీజ్ అయిన టీజర్ కు అనూహ్య స్పందన రావడంతో ఆ అంచనాలు తారా స్థాయికి చేరాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత బన్నీ వాసు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో అఖిల్ ఏ స్థాయి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
Must Read ;- జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లేనా?











