మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. అజేయ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ ప్రస్తుతం సెట్స్ మీదుంది. దీని తర్వాత మెగాస్టార్ వేదాళం తమిళ మూవీ రీమేక్ లో నటించనున్నారు. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మెహర్ రమేష్ చేసిన మార్పులు చేర్పులు చిరుకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి సినిమా స్టార్ట్ చేయడానికి మెహర్ రమేష్ రెడీగా ఉన్నారు.
అయితే… ఈ సినిమాని ఆచార్య సినిమా కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తారు. బహుశా 2021 మార్చిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది అనుకున్నారు. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యిందట. అదేంటి… సైలెంట్ గా స్టార్ట్ చేసేసారా అనుకుంటున్నారా…? ఇంతకీ మేటర్ ఏంటంటే…ఈ సినిమాలో స్టోరీ కలకత్తా నేపధ్యంలో ఉంటుంది. అక్కడ దసరా బ్రహ్మాండంగా జరుగుతుంది. అయితే… కథలో భాగంగా కొన్ని మాంటేజ్ షాట్లు అవసరం ఉన్నాయట. అందుకనే మొన్న దసరాకి వేదాళం టీమ్ కలకత్తా వెళ్లి ఆ ఉత్సవాలను షూట్ చేసిందని తెలిసింది.
ఈ రకంగా వేదాళం రీమేక్ స్టార్ట్ అయినట్టే. 14 రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇందులో చిరు చెల్లెలుగా మహానటి సినిమాతో జాతీయ అవార్డ్ సైతం దక్కించుకున్న కీర్తి సురేష్ నటిస్తుంది. కంత్రి, బిల్లా, శక్తి, షాడో… ఇలా భారీ చిత్రాలను తెరకెక్కించిన మెహర్ రమేష్ ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ సక్సస్ సాధించలేదు. అయినప్పటికీ చిరు అవకాశం ఇచ్చారు. మరి… ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెహర్ రమేష్ సక్సస్ సాధిస్తారని ఆశిద్దాం.