‘జాతిరత్నాలు’ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చి.. తొలి ప్రయత్నంలోనే అందరి మనసులు దోచుకున్న కొంగకాళ్ళ సుందరి ఫరియా అబ్దుల్లా. చిట్టిగా ఇటు గ్లామర్ ఒలికిస్తూనే, అటు చక్కటి అభినయాన్ని కూడా పండించింది. ఈ సినిమా తెచ్చిపెట్టిన సూపర్ క్రేజ్ తో ఆమె పలు అవకాశాల్ని అందుకుంటోంది. అయితే ఫరియా బేబ్ లో కేవలం అందం, అభినయమే కాకుండా.. డ్యాన్స్, పెయింటింగ్, పొయట్రీ లాంటి మిగిలిన కళలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

అలాంటి టాలెంటెడ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లాకి.. ఉత్సాహం వచ్చినప్పుడల్లా డ్యాన్స్ చేయడం హాబీ. దాన్ని హ్యాబిట్ గా మార్చుకొని.. తరచుగా తాను చేసిన డ్యాన్స్ వీడియోస్ ను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ.. నెటిజెన్స్ ను ఆకట్టుకుంటోంది. మొన్న అర్ధరాత్రి హైద్రాబాద్ లో వర్షం పడిన సంగతి తెలిసిందే. ఆ మూడ్ తో అమ్మడు చేసిన డ్యాన్స్ అదిరిపోయింది. ఆజారే మోరో సైయ్యాన్ అనే పాటకి మతిపోగొట్టే మూమెంట్స్ చేసింది.
Must Read ;- తుఫాన్ కల్లోలంలోనూ.. టీవీ బ్యూటీ హాట్ విన్యాసాలు

ఆమె షేర్ చేసిన డ్యాన్సింగ్ వీడియోకి ఇన్ స్టాలో పలు కామెంట్స్ వచ్చిపడ్డాయి. ‘చిట్టి అనే పేరు నీకు పెర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే.. నీ డ్యాన్స్ చూస్తుంటే.. ఎలిమెంటరీ స్కూల్ పిల్ల చిందేసినట్టు గా ఉంది’ అని ఓ చిలిపి నెటిజెన్ కామెంట్ పెట్టాడు. అలాగే.. మరొకడు .. నీ డ్యాన్స్ అదిరిపోయింది.. అంటూ ఆమెను పొగిడేశాడు. అలాగే.. నటీమణి హిమజ సైతం ఫరియా డ్యాన్స్ కు పొడుగుతూ.. కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఫరియా డ్యాన్సింగ్ వీడియో సోషల్ మీడియా ను షేక్ చేసేస్తోంది.











