అందంలోనూ, అభినయంలోనూ మలయాళ ముద్దుగుమ్మలు అందెవేసిన చెయ్యి. పాత్రని బట్టి అభినయాన్ని, పాత్ర డిమాండ్ ను బట్టి.. గ్లామర్ ను పండించగలిగిన సత్తా కలిగిన బ్యూటీస్ వారు. అలాంటి వారిలో అనూ ఇమ్మాన్యుయేల్ ఒకరు. దివి నుంచి భువికి దిగి వచ్చే.. దిగి వచ్చే పారిజాత పువ్వై నీవు.. అని పాడుకొనేలా కవ్వించే ఈ సుందరి .. మజ్ను సినిమాతో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే కుర్రకారు మనుసుదోచింది. ఆమె గ్లామర్ కు ప్రేక్షకులు ఫిదా అవడంతో.. సహజంగానే ఆమెకు అవకాశాలు వచ్చిపడ్డాయి.
ఏకంగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోల సరసన కథానాయికగా నటించే అదృష్టం ఆమెను వరించింది. అయితే ఆ రెండు సినిమాలు పరాజయం పాలవడంతో ఆమె కెరీర్ ఇబ్బందుల్లో పడింది. అయినా సరే ఆమె అందిపుచ్చుకున్న ‘శైలజా రెడ్డి అల్లుడు, అల్లుడు అదుర్స్’ సినిమా ఆఫర్స్ కూడా ఆమెకి లక్ ను తెచ్చిపెట్టలేకపోయాయి. దాంతో ఆమెకు అవకాశాలు తగ్గు ముఖం పట్టాయి.
ముగ్ధమోహనమైన రూపం.. నాజూకు సోయగాలు.. ఆమెకు ప్లస్ అవడంతో .. అవకాశాల వేటలో పడింది అమ్మడు. అయితే దానికోసం అమ్మడు సోషల్ మీడియాను ఆశ్రయించింది. తరచుగా తన హాట్ ఫోటోస్ ను ఇన్ స్టాలో పోస్ట్ చేయడం హాబీగా పెట్టుకుంది. అక్కడ ఆమె ఫాలోయింగ్ మామూలు గా లేదు. ఆమె హాట్ నెస్ కైనా అవకాశాలు రాకపోతాయా అనే ఆశతో ఉంది అనూ.
ప్రస్తుతం అనూ ఇమ్మాన్యుయేల్ చేతిలో మహాసముద్రం సినిమా ఒకటే ఉంది. అందులో మెయిన్ హీరోయిన్ .. అదితీరావు హైదరీ అయినా.. అనూకి మంచి పాత్రనే ఆఫర్ చేశాడు దర్శకుడు అజయ్ భూపతి. ఇక ఈ సినిమా తర్వాత అనూ చేతిలో మరే సినిమాలేకపోవడం గమనార్హం. అందాలు పుష్కలంగా ఉన్నా సరే.. అదృష్టమే అమ్మడి దరిచేరకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి అనూ కెరీర్ ఎప్పటికి మలుపు తిరుగుతుందో చూడాలి.
Must Read ;- లేటు వయసులో హాటు వేషాలేస్తోన్న చిరుతపిల్ల