ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే.. చుట్టకి నిప్పులేదని మరొకడేడ్చాడట. అలా ఉంది జనం ప్రవర్తన. చుట్టుపక్కల ఏం జరిగినా.. పట్టించుకోకుండా తన మానాన తను బతకడం అలవాటైపోయింది ప్రతి ఒక్కరికీ. ఎవరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో చెప్పలేని పరిస్థితి. ఇటీవల ముంబై తీరం దాటిన తౌక్తే తుఫాన్.. గత కొద్ది రోజులుగా ఐదారు రాష్ట్రాల్ని అల్ల కల్లోలం చేసేసింది. ఒక పక్క కరోనాతో ప్రాణాలు గుప్పట్లో బతుకుతున్న ప్రజలకి మరో పక్క తుఫాన్ కూడా తోడవడంతో .. పరిస్థితి భయానకంగా తయారైంది. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ఆస్థులు పోగొట్టుకున్నారు.

ఈ పరిస్థితుల్లో కూడా ఒక సీరియల్ నటీమణి .. తన మానాన తాను హాట్ ఫోటో షూట్ కానిచ్చేసింది. ఆమె పేరు దీపికా సింగ్ గోయల్. ఈ ఫోటోస్ ను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసింది. పైగా దానికి కేప్షన్ కూడా ఇచ్చింది. ‘తుఫాన్ ను మీరు ఆపలేరు కాబట్టి.. దాన్ని మీరు ఆపాలని ప్రయత్నం మాత్రం చేయకండి. అలాగని ఊరికే కూర్చోకుండా.. ప్రకృతిని కౌగిలించుకోండి. దెబ్బకి తుఫాన్ వచ్చిన దారినే వెళ్ళిపోతుంది’. అంటూ తన పైత్యం ప్రదర్శించింది.

అక్కడితో ఆగకుండా.. మా ఇంటి పక్కనే ఓ చెట్టు విరిగిపడింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. దాన్ని తొలగించే ప్రయత్నంలో తౌక్తే తుఫాన్ ను గుర్తు చేసుకునేందుకు నా భర్త రోహిత్, నేను కలిసి కొన్ని ఫోటోస్ ను తీసుకున్నాం. అంటూ ఇన్ స్టాలో అతి చేసింది. దీంతో నెటిజెన్స్ ఆమెకు గడ్డిపెట్టే కార్యక్రమాన్ని షురూ చేశారు. ప్రస్తుతం దీపికా సింగ్ తుఫాన్ ఫోటోలు .. సోషల్ మీడియా తీరాన్ని తాకి.. అల్లకల్లోలం చేస్తున్నాయి.
Must Read ;- లేటు వయసులో హాటు వేషాలేస్తోన్న చిరుతపిల్ల











