భవిషత్తులో నువ్వేమవుతావ్ అని నేటి తరం పిల్లల్ని అడిగితే.. ఏ ఇంజినీరో.. డాక్టరో.. పైలట్.. ఇలా ఏవేవో చెప్తారే తప్ప.. రాజకీయాల్లోకి వెళ్తామని మాత్రం అనరు. అదొక ఫీల్డ్ అనేది ఉందని కూడా గుర్తించరు. నేటి యువతలో వారసత్వంగా రాజకీయ రంగంలోకి అడుగిడుతున్న వారున్నారు కానీ, నేటి తరంలో ఎటువంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేకుండా రాజకీయాల వైపు మళ్లుతున్న యువత చాలా తక్కువేనని చెప్పాలి. రాజకీయాల్లోకి రావాలని కాలేజీ రోజుల నుంచే కష్టపడే వారు నేటి తరంలో కనుమరుగయ్యారు. అలాంటి నేపథ్యంలో ఓ మహిళా నేత 23 ఏళ్ల వయసుకే రాజకీయాల వైపు అడుగులు వేసింది. అలాగని తనేమీ చదువురాని అమ్మాయి అనుకునేరు. ఉన్నత విద్య (బీటెక్)ను అభ్యసించారు. గుంటూరు జిల్లాలో 23 ఏళ్ల గిరిజ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ తరపున సర్పంచ్ గా పోటీ చేస్తూ రాజకీయ బరిలో నిలిచారు. అధికర పార్టీని ఓడించగలననే ధీమాతో ఉన్నారు.
తెలుగుదేశంకి ఇదేం కొత్త కాదు..
సామాన్యుడు అభివృద్ధే లక్ష్యంగా స్థాపించిన పార్టీ తెలుగుదేశం. కనీసం ముక్కు ముఖం కూడా తెలియని వారికి టికెట్లు ఇచ్చి ఆనాడు యువతను రాజకీయాల్లోకి ఆహ్వానించారు ఎన్టీఆర్. నేడు దాదాపు ఏ పార్టీలో చూసినా.. ఆనాడు తెలుగుదేశం ద్వారా ఎదిగిన నాయకులే నేటికీ కనిపిస్తున్నారు. యువతంటే కేవలం మగవారు మాత్రమే కాదు.. మహిళలకు సామాన హక్కులను కల్పిస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీ. కేవలం చెప్పడం కాదు వాటిని మొదటి నుండి ఆచరణలో పెడ్తూ, మహిళా సాధికారతకు కృషి చేస్తున్న పార్టీగా పేరుపొందింది. ఇదే మాటను పంచాయతీ ఎన్నికల్లో సైతం నిజం చేసి చూపించింది తెలుగుదేశం. అందుకు నిదర్శనమే గిరిజ.
నారా లోకేష్ పిలుపు..
యువ భారత నిర్మాణానికి యువత రాజకీల్లోకి రావాల్సిన అవసరం ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లాలోని అందుకూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్న 23 ఏళ్ల గిరిజ అనే యువతిని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. బీటెక్ చదివిన గిరిజ.. గ్రామాభివృద్ధికి పాటుపడాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారని, ఆమెను స్ఫూర్తిగా తీసుకుని యువత రాజకీయాల వైపు దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ మేరకు లోకేశ్ శనివారం ట్వీట్ చేశారు.
Best wishes to 23-yr-old D Girija (B. Tech), who is contesting for the post of Sarpanch at Andukuru Village, Guntur District. For a young nation like ours, participation of youth in politics is essential. Girija is leading by example! All the best Amma! pic.twitter.com/E7Nm8MLycJ
— Lokesh Nara (@naralokesh) February 13, 2021
‘మన లాంటి యువత రాజకీయాల్లో ఉండడం.. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి అత్యవసరం. బీటెక్ చదువుకున్న 23 ఏళ్ల గిరిజ.. అందుకూరు గ్రామం నుంచి సర్పంచ్ పదవికి పోటీ పడుతోంది. ఆమెకు టీడీపీ మద్దతిస్తోంది. ఈ యువతిని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది రాజకీయాల్లోకి రావాలి’ అని లోకేశ్ ట్విటర్లో పేర్కొన్నారు.
ధైర్యానికి హ్యట్సాఫ్..
అసలే పంచాయతీ ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. బలవంతపు ఏకగ్రీవాలు.. నామినేషన్లను అడ్డుకోవడాలు.. ఉపసంహరించుకోమని బెదిరింపులు, కాదంటే దాడులు. ఇలా సాగుతున్న నేపథ్యంలో అధికార పార్టీనీ కాదని.. ఉన్నత చదువులు చదివి.. మహిళా అయుండి ఎంతో ధైర్యంగా ప్రతిపక్ష పార్టీ తరపున సర్పంచ్‌గా పోటీలో నిలిచారు గిరిజ. నేటి యువత గిరిజను ఆదర్శంగా తీసుకోవాలి. ఏ ఇంజనీరింగో.. చదివామా.. ఉద్యోగం చేశామా అనే కాదు.. దేశ భవిషత్తుని తీర్చి దిద్దే నాయకులుగా ఎదగాల్సిన వాళ్లు కూడా యువతే.. వారి చేతిలోనే మన దేశ అభివృద్ధి దాగుందని మరిచిపోకూడదు. రాజకీయం అనగానే.. అందులోకి ఎవరు కాలు పెడతారు అనే భావన మారాలి. నేటి తరం లేనిదే.. భవిషత్తు నాయకులు లేరని గుర్తుంచుకోండి.
కేరళ ఘటన ఆదర్శం..
దేశ రాజకీయ చరిత్రలో 21 ఏళ్ల వయస్సులోనే మేయర్ పదివిని చేపట్టిన చిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది ‘ఆర్యా రాజేంద్రన్’. కాలేజీ రోజుల నుండే రాజకీయాల పట్ల ఆసక్తి కనబరచి.. కేరళలోని సిపిఐ(ఎం) తరపున తిరువనంతపురంలోని ముదువన్‌ముక్కల్ వార్డు మెంబర్‌గా గెలించింది. మేయర్ పదవికి యువతకు ప్రాధాన్యం ఇవ్వాలనుకున్న నేపథ్యంలో.. 21 ఏళ్లకే, రాజకీయాల్లో అత్యంత అనుభవం కలిగిన ప్రత్యర్ధిని ఓడించి వార్డు మెంబర్‌గా గెలిచిన ఆర్యా రాజేంద్రన్ వారి దృష్టిని ఆకర్షించింది. వెంటనే తన గురించి ఆరా తీసి.. తనని మేయర్‌గా ప్రకటించింది ప్రభుత్వం.