నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే విజయం సాధించిన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఆతర్వాత నేను లోకల్ సినిమాతో మరో విజయం సాధించింది. ఇక మహానటి సినిమాతో అలనాటి నటి సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు వారి హృదయాల్లో సుస్థిర స్ధానం సంపాదించుకుంది. ఈ సినిమాతో జాతీయ అవార్డు సైతం దక్కించుకుంది. దీంతో కీర్తి సురేష్ వరుస ఆఫర్స్ తో కెరీర్ లో ఫుల్ బిజీ అయ్యింది. ఈ అమ్మడు తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ దూసుకెళుతుంది.
అయితే.. ఈ మలయాళ ముద్దుగుమ్మ ప్రేమలో పడిందని.. త్వరలో పెళ్లి చేసుకోబోతుందని ఓ వార్త బయటకు వచ్చింది. ముఖ్యంగా కీర్తి సురేష్ లవ్ మ్యాటర్ కోలీవుడ్ లో బాగా ప్రచారంలో ఉంది. ఇంతకీ ఎవరితో లవ్ లో పడిందంటే.. యువ సంగీత సంచలనం అనిరుథ్ తో అంటూ కోలీవుడ్ అంతా కోడై కూస్తుంది. అటు కీర్తి సురేష్ కానీ. ఇటు అనిరుథ్ కానీ ఈ వార్తల పై స్పందించలేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం త్వరలోనే వీరిద్దరూ కలిసి మ్యారేజ్ ఎప్పుడు చేసుకోనున్నారో ఎనౌన్స్ చేస్తారని ప్రచారం జరుగుతుంది.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అసలు ఈ వార్త నిజమేనా.? కాదా..? కీర్తి సురేష్ క్లారిటీ ఇస్తుందేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే.. నితిన్ సరసన రంగ్ దే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే నగేష్ కుకునూర్ దర్శకత్వంలో గుడ్ లక్ సఖీ సినిమాలో కూడా నటిస్తుంది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త పై కీర్తి సురేష్ కానీ, అనిరుథ్ కానీ త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.











