సినిమా రంగంలో కార్మికులను ఆదుకోడానికి నిర్మాతలు, డ్యాన్స్ మాస్టర్లు ముందుకొస్తున్నారు. నిర్మాతలు ‘కళామతల్లి చేదోడు’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా ఈరోజు 600 మంది సినీ కార్మికులకు చేయూతనిచ్చారు. నిర్మాతలు దిల్ రాజు,చదవాలవాడ శ్రీనివాస్ రావు, యలమంచిలి రవిచంద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఉదయం ఫిల్మ్ ఛాంబర్ లో చేపట్టారు.మహిళా వర్కర్స్ కి, డ్రైవర్స్ కి, జూనియర్ ఆర్టిస్టులు కి, ప్రొడక్షన్ వర్కర్స్ కి నిత్యావసరాలను పంపిణీ చేశారు.
దాదాపు నెలకు సరిపడా నిత్య అవసరమ సామాగ్రి అయిన రైస్ బ్యాగ్, కంది పప్పు, రెండు ఆయిల్ పాకెట్స్, కంది పప్పు, గోధుమ పిండి, మినప గుండ్లు, పంచదార, ఎండుమిర్చి, గోధుమ రవ్వ, టీ పౌడర్, పసుపు, పెసర పప్పు, ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ, చింత పండు, రిన్ సోప్ లు, విమ్ బార్ లు, కోల్గేట్ పేస్ట్, జిరా, ఆవాలు, అన్ని రెండు కిలో లు తదితర సామగ్రిని జి మార్ట్ సూపర్ మార్కెట్ ద్వారా ప్యాక్ చేసి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్ ,అజయ్ కుమార్ , వల్లభనేని అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ఇలాంటి కష్ట కాలంలో భాగస్వాములు కావాలి అనేది తమ ఉద్దేశంమని వీరు అంటున్నారు. యలమంచిలి రవి చంద్ మాట్లాడుతూ ప్రస్తుత కష్ట కాలంలో ప్రతి పేద సినిమా కార్మికుడుఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వారందరినీ ఆదుకోవాలని ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగిందన్నారు. ‘ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో నాలుగు వేల మంది సినీ వర్కర్స్ ఉన్నారు. ఇప్పుడు వారందరికీ ఓకే సారి గ్రాసరీస్ పంపిణీ చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని గుర్తించి కోవిడ్ కారణాల దృష్టా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 600 మందికి మొదటి విడతగా ఫుడ్ గ్రాసరీస్ ఇచ్చామన్నారు.
మిగిలిన వారందరికీ కూడా దశల వారీగా ఫుడ్ గ్రాసరీస్ అందిస్తామన్నారు. చాలా మంది పెద్దలు సినీ పేద కార్మికులకు సర్వీస్ చేయాలని వారికి మీరు సహయం చెయ్యమని మాకు డబ్బు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయితే వారి నుంచి మేము ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వారు చేసే సహాయాన్ని మేము సెలెక్ట్ చేసుకొన్న సూపర్ మార్కెట్ కు పే చెయ్యమని సూచించాము. అ సూపర్ మార్కెట్ ద్వారా రూ.2500 విలువ కలిగిన నెలకు సరిపడా ఫుడ్ గ్రాసరీస్ ను అందజేశాము. అలాగే కరోనా ఉన్నంత వరకు ప్రతి పేద సినీ కార్మికుడికీ మేము సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటాం .
సినీ వర్కర్స్ కు సహాయం చేసే విషయంలో నేను దిల్ రాజు గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఒక్క మాట కూడా అడగకుండా ఒకే చెయ్యి ఏం కావాలి అన్న నా సపోర్ట్ ఉంటుంది అని ముందుకు వచ్చినందుకు నా ధన్యవాదములు, అలాగే చదల వాడ శ్రీనివాసరావు గారు నేను అడగగానే ముందుకు వచ్చారు వారికీ నా ధన్య వాదములు తెలియచేస్తున్నాను’ అన్నారు. అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ కరోనా కష్ట కాలం లో యలమంచిలి రవిచంద్ పనులు లేక ఇబ్బంది పడుతున్న వల్ల అందరకీ తనవంతు సాయం గా ఇలాంటి కార్యక్రమం చేపడుతు న్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
బెక్కం వేణుగోపాల్ గారు మాట్లాడుతూ.. యలమంచిలి రవి చంద్ గారు ఈ కష్ట కాలం లో పేదలకి ఇలాంటి సాయం చేస్తున్నందుకు నా అభినందనలు తెలుఫుతున్నాను’ అన్నారు. ఇక డ్యాన్స్ మాస్టర్లు కూడా ఎవరికి వారు డ్యాన్సర్లను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఇప్పటికే సాయం అందించారు. ఆట సందీప్, జ్యోతిరాజ్ దంపతులు కూడా డ్యాన్సర్లకు రెండో విడత సాయం అందించారు.
Must Read ;- సీసీసీ ఆధ్వర్యంలో తెలుగు సినీ కార్మికులకు వాక్సినేషన్