నాగశౌర్య కథానాయకుడిగా ‘లక్ష్య’ సినిమా రూపొందుతోంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి నారాయణ దాస్ నారంగ్ .. రామ్ మోహన్ రావు .. శరత్ మరార్ నిర్మిస్తున్నారు. ప్రాచీన విలువిద్యకి సంబంధించిన నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. నాగశౌర్య జోడీగా కేతిక శర్మ అలరించనుంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణలో ఉంది. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ యూత్ ను ఆకట్టుకునేదిగా ఉంది.
నాగశౌర్య ఇంతకుముందు చేసిన ‘అశ్వద్ధామ’ పరాజయం పాలైంది. దాంతో మంచికథ కోసం వెయిట్ చేస్తూ వచ్చిన ఆయన, ‘లక్ష్య’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా తన కెరీయర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని, తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మంకంతో ఉన్నాడు. ఇక ‘రొమాంటిక్’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న కేతిక శర్మ, ‘లక్ష్య’సినిమాతో నిలబడుతుందేమో చూడాలి.











