నటసింహ నందమూరి బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ కు బ్రేకిచ్చిన దర్శకుడు బోయపాటి.. సినిమా విడుదలకు వేరే డేట్ అన్వేషిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. బాలయ్య తదుపరి చిత్రంపై అప్పుడే తెగ అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్స్ గురించి వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
అఖండ మూవీ పూర్తయిన వెంటనే.. ‘క్రాక్’ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటించేందుకు బాలయ్య సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో ఒక పాత్ర ఫ్యాక్షనిస్ట్ అయితే మరో పాత్ర పోలీస్ అని సమాచారం. అయితే ఈ ఇద్దరిలో ఒక పాత్రకి హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తోందని వార్తలొస్తుండగా.. ఇప్పుడు ఇందులోని మరో హీరోయిన్ గా సీనియర్ నటి పేరు వినిస్తోంది. ఆమె వేరెవరో కాదు అందాల మీనా.
నైంటీస్ లో టాలీవుడ్ లోని అందరు అగ్ర కథానాయకుల సరసన నటించి మెప్పించిన అందాల మీనా.. బాలయ్య తో కూడా ‘ముద్దుల మొగుడు, బొబ్బలి సింహం’ లాంటి చిత్రాల్లో గ్లామర్ ఒలకబోసిన సంగతి తెలిసిందే. వెంకీతో ‘దృశ్యం2’ లో హీరోయిన్ గా చేస్తూనే.. ఇప్పుడు బాలయ్యతో కూడా నటిస్తుండడం విశేషంగా మారింది. ఇందులోని ఫ్యాక్షనిస్ట్ బాలయ్య సరసన మీనా హీరోయిన్ గా నటిస్తోందట. మరి ఈ సినిమా బాలయ్యకి ఏ రేంజ్ సినిమా అవుతుందో చూడాలి.