తనలో క్రియేటివిటీ పస తగ్గిపోయింది అనే ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ ఉన్న దర్శకులు ఇప్పుడు బూతు కంటెంట్ నే నమ్మకుంటున్నారు. ఆ తరహా సినిమాలకి మంచి కలెక్షన్స్ దక్కినా, రెప్యుటేషన్ మాత్రం ఘోరంగా దెబ్బతింటోంది. రామ్ గోపాల్ వర్మనే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. క్లైమాక్స్, నెకెడ్ లాంటి సినిమాలతో వర్మ తన పరువు తానే తీసుకుంటున్నాడు. ఒకప్పుడు సుమంత్ ఆర్ట్స్ ప్రాడక్షన్స్ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ మూవీస్ నిర్మించి.. ‘వాన , తూనీగ తూనీగ’ లాంటి యూత్ ఫుల్ సినిమాలకి దర్శకత్వం వహించిన టాప్ ప్రొడ్యూసర్ యం.యస్.రాజు సైతం.. ఇప్పుడు ‘డర్టీ హరి’ అనే అడల్ట్ కంటెంట్ మూవీ ని తెరకెక్కిస్తున్నాడు.
టీజర్ చూస్తే .. సినిమాలో బూతు దృశ్యాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధమవుతుంది. ఈయనేనా ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు తీసిన నిర్మాత అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బూతు సినిమాలతో తప్పితే.. మామూలు సినిమాలతో లాభం లేదని భావించాడో ఏమో.. ఆయన కూడా డర్టీ పిక్చర్స్ మొదలుపెట్టేశాడు.
ఇప్పుడు ఇదే బాటలో వైవిధ్య చిత్రాల దర్శకుడు రవిబాబు కూడా ట్రావెల్ అవుతూండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రవిబాబు అంటే టాలీవుడ్ వర్గాల్లో ఒక మంచి అభిప్రాయం ఉంది. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగా మోడ్రన్ కామెడీ ఎంటర్ టైనర్స్ తీయడంలో ఆయన దిట్ట అని అందరూ అంగీకరిస్తారు.
‘అల్లరి, అమ్మాయిలు అబ్బాయిలు, పార్టీ, సోగ్గాడు, లడ్డు బాబు, మనసారా, నువ్విలా, నచ్చావులే’ లాంటి యూత్ ఫుల్ మూవీస్ తీయడమే కాకుండా.. ‘అనసూయ, అమరావతి, అవును’ లాంటి హారర్స్, థ్రిల్లర్స్ తీయడంలో కూడా ఆయన మాస్టర్. అలాంటి రవిబాబు.. ఇప్పుడు బిగ్రేడ్ మూవీస్ కన్నా దారుణమైన అడల్డ్ కంటెంట్ తో ‘క్రష్’ అనే మూవీ తెరకెక్కిస్తుండడం పలు విమర్శలకు దారి తీసింది. ఇటీవల విడుదలైన ‘క్రష్’ ఫస్ట్ పీప్ చూస్తే.. ఆయన ఏ రేంజ్ కి దిగజారిపోయాడో అర్ధమవుతుంది. హాలీవుడ్ సిరీస్ ‘అమెరికన్ పై’ తరహాలోని బూతు సీన్స్ తో నిండిపోయిన ‘క్రష్’ అతి త్వరలోనే విడుదల కానుంది.
అందులోని కంటెంట్ ను బట్టి.. ఈ సినిమా ఖచ్చితంగా ఇప్పటి కుర్రోళ్ళకు బాగానే కనెక్ట్ అవుతుంది కానీ.. దీంతో ఆయన రిప్పుటేషన్ గంగలో కలిసే ప్రమాదం ఉందని టాలీవుడ్ వర్గాల వారు చెప్పుకుంటున్నారు. ఒకప్పుడు దర్శకుడు మారుతి వరుసగా బూతు సినిమాలు తీసి విమర్శలెదుర్కొన్నాడు. ఆ తర్వాత తన తప్పు తాను తెలుసుకొని.. ఇప్పుడు ఫీల్ గుడ్ మూవీస్ తీస్తున్నాడు. అయితే దీనికి పూర్తి భిన్నంగా రవిబాబు.. ఒకప్పుడు మంచి సినిమాలు తీసి.. ఇప్పుడు బూతు సినిమాల వైపుకు మళ్ళడం షాకిస్తోంది. బిగినింగ్ లో రవిబాబు తీసిన ‘అబ్బాయిలు అమ్మాయిలు’ సినిమా కూడా అప్పట్లో విమర్శలు ఎదుర్కొంది కానీ.. అందులో అడల్ట్ కంటెంట్ కాస్తంత తక్కువే. మరి ‘క్రష్’ మూవీతో రవిబాబు.. ఇప్పటి యూత్ కు ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నాడో ఆయనకే తెలియాలి.











