రవితేజ సరసన మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి నాయకలుగా నటిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఇటీవల ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న మ్యూజిక్ సిట్టింగ్స్.లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, దర్శకుడు రమేష్ వర్మ తదితరులు పాల్గొంటున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు దేవి శ్రీప్రసాద్, ‘లూసిఫర్’ ఫేమ్ సుజిత్ వాసుదేవ్, ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ తదితరులు పనిచేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా, దేవిశ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ సంభాషణలు రాస్తున్న ఈ చిత్రానికి శ్రీమణి సాహిత్యాన్ని, అమర్ రెడ్డి ఎడిటింగ్ ను అందిస్తున్నారు.
Must Read ;- గోవాలో మాస్ మహారాజా ఏం చేయబోతున్నాడు?