ఉన్నప్పుడు ఆక్రమించారంటూ విశాఖ ప్రాంతంలోని టీడీపీ నేతల ఆస్తులను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని బోర్డులు ఏర్పాటు చేశారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆక్రమించుకున్నారంటూ రుషికొండ సమీపంలోని గెడ్డ ప్రాంతాన్ని ఆదివారం తెల్లవారుజామున అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పీలా గోవింద్ ఆక్రమించారంటూ బీడీపాలెం, ఆనందపురం మండలంలో 360 ఎకరాలను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూముల విలువ రూ.300 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న భూముల్లో రెవెన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. బీడీపాలెం గ్రామ సర్వే నెంబరు156లో 60 ఎకరాలు,ఆనందపురం మండలంలోని కొండ పోరంబోకు భూమి 300 ఎకరాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రభుత్వ భూములను కబ్జా చేశారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే, టీడీపీ నాయకులు వాటిని ఖండిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని అంటున్నారు.
జగన్ దెబ్బకి విజయసాయి రెడ్డి కన్నీరు పెట్టాడు… షర్మిల సంచలనం..!!
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు పీసీసీ...