కోలుకోలేనంతంగా పతనమైన నిర్మాణ రంగం..!
జగన్ రెడ్డి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు ఏపీలో నిర్మాణ రంగం, దాని అనుబంధ రంగాలన్నీంటిని కుదేలయ్యేలా చేస్తోంది! పాలన పగ్గాలు చేపట్టిన తొలినాళ్ల నుంచి ఇసుకును పూర్తిగా బ్లాక్ చేశారు. నాటి నుంచి నేటి వరకు సామాన్యుడు ఇసుకను బ్లాక్ లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇసుక ను స్వార్ధపూరిత లాభాలకు గుప్తేదారుల చేతికి అప్పగించి, ఇష్టారాజ్యంగా ఇసుక అమ్మకాలు జరుపుతున్నారు. బహిరంగ మార్కెట్లో టన్ను ఇసుక రూ.1600 అమ్మతోంది. ఇలా లారీ ఇసుక కావాలంటే రూ. 70 – 80 వేలు పలుకుతోంది. ఈ ధరల్లో నిర్మాణ రంగాన్ని చేపట్టాలంటే పేద, మధ్య తరగతి కుటుంబాలు తలమనకలౌతున్నాయి. టోటల్ కంట్రక్షన్ ఫిల్డ్ నెలమట్టమైంది. వీటికి తోడూ ఇటుక, స్టీల్, పెయింట్స్ వంటివి ధరలు ఆకాశాన్నంటాయి. ఇవన్నీ ఇలా ఉంటే.. ములిగే నక్కపై తాటికాయపడినట్లు సిమెంట్ ధరలనూ అమాంతం పెంచారు. సిమెంట్ బస్తాకు ఏకంగా రూ. 30 చొప్పున పెంచారు. దీంతో సామాన్యుడు సొంతింటి కల కలగానే మిగిలిపోతోంది. ఏపీ లో ఒక్కసారిగా కుదేలైన నిర్మాణం రంగం కారణంగా దీనిపై ఆధారపడి జీవించే 30 లక్షల మంది దిక్కుతోచని స్థితిలో రోడ్డున పడ్డారు.
మూసివేత దిశగా రియల్ ఎస్టేట్ కంపెనీలు..!
ఇసుక, సిమెంట్ కు తోడూ.. స్టీల్, పెయింట్స్ .. ఇలా ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మూడేళ్ల క్రితంతో పొల్చితే ఇంటి నిర్మాణ బడ్జెట్ 50 శాతం పెరిగింది. దీనికితోడు పన్ను భారం అదనపు వడ్డనగా మారింది. ప్రస్తుత మార్కెట్లో సిమెంట్ బస్తా రూ. 320 – 350 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ.380 వరకు పెరిగింది. నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల సామాగ్రి 60 శాతంకు పైగా పెరిగి ధరలు భయపెడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నిర్మాణాలు చెపట్టడం అవసమా? అని నిర్మాణ రంగ సంస్థలు వారి కన్స్ట్రక్షన్ నిర్ణాయాలను వెనక్కితీసుకుంటున్నాయి. కొన్ని రియల్ ఎస్టేట్ కంపీనీలైతే ఉద్యోగులకు జీతాలివ్వలేక, పెరుగుతున్న అప్పులు రిటర్న్ చేయలేక సంస్థలను మూత వేసుకుంటున్నారు. ఒకప్పుడు రూ. 10 లక్షలకు పూర్తయ్యే ఇళ్లు నేడు రూ. 15 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం నియంత్రించేవి, నియంత్రణలో ఉండే వస్తువుల ధరలు అన్నీ పెరిగాయి. గతంలో పొల్చుకుంటే ప్రభుత్వం చేతిలో ఉన్న ఇసుక ధర మూడింతలు పెరిగింది. ఉచితంగా ఇచ్చే ఇసుకకు ప్రభుత్వమే రేటు నిర్ణయించి ధర వసూలు చేస్తోంది. అలానే నియంత్రించగల సిమెంట్, స్టీల్ తదితర వస్తువులు ధరలు కూడా తగ్గించే దిశగా చర్యలు తీసుకోలేదు. సిమెంట్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వమే భూమి, విద్యుత్, నీరు, సున్నపురాయి గనులను కూడా కేటాయిస్తోంది. ఇవన్నీ ప్రభుత్వం చేతులో ఉన్నప్పుడు ఎందుకు నియంత్రిచలేకపోతుందని విపక్షాలు మండిపడుతున్నాయి.











