గత ప్రభుత్వ హయాంలో మంగళగిరి సమీపంలోని ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి భూమి కేటాయించడంపై వైసీపీ ఎమ్మెల్యే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మెరిట్స్ ఆధారంగా విచారణ జరిపి నాలుగు నెలల్లో తేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి రెండు వారాలు గడువిచ్చింది. దానిపై రిజాయిండర్ దాఖలు చేయడానికి ప్రతివాదులకు వారం రోజులు గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి అప్పటి ప్రభుత్వం టీడీపీ కార్యాలయానికి స్థలం కేటాయించిందంటూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టును ఆశ్రియించిన సంగతి తెలిసిందే.
హైకోర్టు తోసిపుచ్చింది..
గతంలో టీడీపీకి కేటాయించిన స్థలం రద్దు చేయాలంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, చాలా ఆలస్యంగా వచ్చారంటూ కేసును కొట్టి వేసింది. దీంతో ఆళ్ల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గురువారం దీనిపై ప్రముఖ న్యాయవాదులు ఇరువర్గాల తరపున వాదనలు వినిపించారు. ఎమ్మెల్యే తరఫున ప్రశాంత్ భూషణ్, అల్లంకి రమేష్, టీడీపీ తరపున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ కేసును హైకోర్టుకే బదిలీ చేయాలని సింఘ్వీ వాదనలు వినిపించారు. తామూ అదే అభిప్రాయంతో ఉన్నట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
Must Read ;- చంద్రబాబుపై తాము కేసు పెట్టలేదన్న రైతులు.. ఆళ్ల కుట్ర బట్టబయిలు











