యంగ్ టైగర్ యన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ లో రామ్ చరణ్ తో కలసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 13న విడుదల కాబోతోంది. ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. ఆర్.ఆర్,ఆర్ షూటింగ్ . దీని తర్వాత యన్టీఆర్ నటించబోయే సినిమా మీద ప్రస్తుతం ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. దానికి కారణం ఆ సినిమాకి కొరటాల శివ దర్శకుడవడమే. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ రికార్డు కలెక్షన్స్ రాబట్టిన నేపథ్యంలో ఇప్పుడీ రెండో సినిమా మీద అభిమానుల్లో విపరీతమైన క్యూరియాసిటీ మొదలైంది.
యన్టీఆర్ 30 వ సినిమాగా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమా కథ పై ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే.. ఇప్పుడీ సినిమాలో విలన్ పాత్ర మీద కూడా ఓ అప్డేట్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం తారక్ , కొరటాల సినిమాలో విలన్ గా బాలీవుడ్ యాక్టర్ సైఫ్ ఆలీఖాన్ నటించబోతున్నాడట. ఆల్రెడీ సైఫ్ .. ప్రభాస్ ఆదిపురుష్ లో రావణుడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే యన్టీఆర్ త్రివిక్రమ్ మూవీలో కూడా విలన్ అతడే అంటూ ఆ మద్య వార్తలొచ్చాయి. మరి ఈ వార్తలో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిజానికి తారక్ .. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో న్యూక్లియర్ అనే సైంటిఫిక్ మూవీలో నటిస్తాడని వార్తలొచ్చాయి. ఆ మేరకు ప్రశాంత్ కూడా తారక్ పుట్టిన రోజు నాడు.. ఈ సినిమాపై కొంత సమాచారం కూడా అందించాడు. అయితే .. ప్రశాంత్ నీల్ సడెన్ గా ప్రభాస్ తో సలార్ మొదలు పెట్టి అందరికీ షాకిచ్చాడు. తారక్ తో చేయబోయే సినిమా పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. అలాగే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ తదుపరి చిత్రం ఉంటుందని ఇప్పటి వరకూ అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఫైనల్ గా కొరటాల శివ సీన్ లోకి వచ్చాడు. మరి ఈ సినిమాలో సైఫ్ విలనిజం ఎలా ఉండబోతుందో చూడాలి.
Must Read ;- తారక్ , కొరటాల కాంబో మూవీ కథ ఇదేనా?