ఈ ఏడాది సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. దాని తర్వాత యన్టీఆర్ హీరోగా మరో సినిమా అనౌన్స్ చేశారు హారిక అండ్ హాసిని సంస్థ వారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో కళ్యాణ్ రామ్ హ్యాండ్ కూడా ఉంది. రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన వెంటనే.. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లోకి జాయిన్ అవ్వాలని తారక్ ప్లాన్ చేశాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ఈ సినిమాకి సంబంధించిన అందరి ప్లాన్స్ అటకెక్కాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమానే ఇంకా కంప్లీట్ కాలేదు. విడుదల తేదీ కూడా ఛేంజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో యన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమాకి మరింత టైమ్ పట్టేలా కనిపిస్తోంది.
దాదాపు ఆరు నెలల తర్వాత కానీ.. త్రివిక్రమ్, తారక్ ప్రాజెక్ట్ లాంచ్ అయ్యే పరిస్థితుల్లేవు. అయితే ఈ టైమ్ లో మాటల మాంత్రికుడు.. డైలాగ్ వెర్షన్ ను లాక్ చేశాడని తెలుస్తోంది. ఎర్లియర్ గా ఈ ఇద్దరి కాంబో మూవీ ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా ఏ రేంజ్ హిట్టయిందో తెలిసిందే. ఇప్పుడు కూడా అదే స్థాయిలో తారక్ పాత్రను డిజైన్ చేశాడట త్రివిక్రమ్. ‘పోయిరావలె హస్తినకు’ అనే వెరైటీ టైటిల్ ను ఈ సినిమా కోసం రిజిస్టర్ చేసినట్టు ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. మరి ఈ సినిమా తారక్ కు ఏ రేంజ్ హిట్టిస్తుందో చూడాలి.











