ఆస్ట్రేలియా డాషింగ్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్, భారత సంతతి అమ్మాయి వినీ రామన్ ఇటీవల పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రస్తుతం మ్యాక్స్ వెల్ ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతుండడంతో ఆ జట్టు ఫ్రాంచైజీ యాజమాన్యం మ్యాక్స్ వెల్-వినీ రామన్ ల పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో మ్యాక్స్ వెల్, వినీ జోడీ భారత సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమంది. కాగా, తన బెస్ట్ ఫ్రెండ్ మ్యాక్స్ వెల్ పెళ్లి రిసెప్షన్ లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సందడి చేశాడు. ఇతర ఆటగాళ్లతో కలిసి పుష్ప చిత్రంలోని “ఊ అంటావా మావా.. ఊహూ అంటావా ” పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ముఖ్యంగా, యువ ఆటగాడు షాబాజ్ అహ్మద్ తో కలిసి కోహ్లీ చేసిన డ్యాన్స్ హైలైట్ గా నిలిచింది. ఇక ఇతర ఆటగాళ్లు, జట్టు సహాయకసిబ్బంది చప్పట్లతో హుషారెత్తిస్తుండగా, కోహ్లీ రెచ్చిపోయి మరీ చిందేశాడు. ఈ కార్యక్రమానికి కోహ్లీతో పాటు ఆయన భార్య అనుష్క శర్మ కూడా హాజరైంది.
సీఎంగా లోకేష్‌కి ప్రమోషన్… యువనేత పుట్టినరోజు చంద్రబాబు సంచలన కామెంట్స్…!!
గతకొద్ది రోజులుగా ఏపీలో లోకేష్ చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. నిన్నా, మొన్నటి వరకు...