Will Heroine Rashi Khanna Increase Her Remuneration :
రాశి ఖన్నా .. అప్పుడే సముద్రంలో నుంచి కొట్టుకొచ్చిన స్వచ్ఛమైన శంఖంలా ఉంటుంది. వాన చినుకు తాకగానే అదిరిపడే తామరపువ్వులా ఉంటుంది. పాలసముద్రంలో పడవలను గుర్తుకుచేసే కళ్లతో కట్టిపడేసే సౌందర్యం రాశి ఖన్నా(Rashi Khanna) సొంతం. నందివర్ధనాలతో అలంకరించిన నాజూకు శిల్పంలాంటి ఆమెను చూసి మనసు పారేసుకోని కుర్రాళ్లు లేరు. అలాంటి రాశి ఖన్నా ఎప్పుడూ కూడా చకచకా సినిమాలు చేయాలని హడావిడి పడిపోలేదు. కానీ ఇటీవల మాత్రం తన జోరు పెంచడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు కనిపిస్తోంది.
అమాయకత్వం .. నిర్మలత్వం కలగలిసిన ఒక ప్రత్యేకమైన ఆకర్షణ రాశి ఖన్నాలో కనిస్తుంది. తన కెరియర్ ను మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆమె వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఇంతవరకూ చేసిన సినిమాల్లో ‘జిల్’ .. ‘బెంగాల్ టైగర్’ .. ‘సుప్రీమ్‘ .. ‘తొలిప్రేమ’ భారీ విజయాలను అందుకున్నాయి. ‘సుప్రీమ్’ సినిమాలోని బెల్లం శ్రీదేవి .. ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలోని ఏంజిల్ ఆర్నా పాత్రలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. కరోనా కారణంగా ఆలస్యమైన ఈ సినిమాలు, ఒక ఒక్కొక్కటిగా థియేటర్లలోకి దిగనున్నాయి.
తెలుగులో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ‘ చేస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. అలా మారుతి దర్శకత్వంలో గోపీచంద్ జోడీగా ‘పక్కా కమర్షియల్’ చేస్తోంది. ఇక తమిళంలో ఆమె చేస్తున్న అరణ్మణై 3 .. తుగ్లక్ దర్బార్ .. సర్దార్ సినిమాలపై అంచనాలు బాగానే ఉన్నాయి. మలయాళంలో ‘బ్రహ్మం’ సినిమాపై కూడా అక్కడ ప్రేక్షకులలో ఆసక్తి ఉంది. ఈ సినిమాలలో సక్సెస్ అయ్యేవే ఎక్కువనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇక రాశి ఖన్నా పారితోషికం పెంచుకోవచ్చని ధీమాగా చెబుతున్నారు.
Must Read ;- కృతి శెట్టి తరువాత ఆ రేంజ్ లో జోరు చూపించేదెవరు?











