‘పెగాసస్’ స్పై వేర్ ఉదంతం తీవ్ర సంచలనం రేపుతోంది. దేశంలోని ఆయా రంగాల ప్రముఖల ఫోన్లను ఈ సాఫ్ట్ వేర్ ద్వారా హ్యాక్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయనే విమర్శలు అంతటా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త పీకే ఫోన్లు సైతం హ్యాకింగ్ గురై అవకాశాలున్నాయని వార్తలు రావడంతో అందరికి పెగాసస్ భయం పట్టుకుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించి విచారించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడీ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు కాంగ్రెస్ ఎంపీ శశి ధరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయి సంఘం విచారణ జరపనుంది. ఈ నెల 28న కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల్ని ప్రశ్నించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
దేశభద్రతకు ముప్పు (Congress Leaders Fires On Pagasus Issue)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్‌తో హక్కులకు భంగం కలిగిస్తున్నాయని, దొంగచాటు కుట్రలను అడ్డుకోవాలన్నారు. సమాచారాన్ని మొత్తం విదేశాల చేతుల్లో పెడుతున్నారని, దేశ భద్రతకు ప్రధాని మోదీ, అమిత్ షా ముప్పు తెస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పాలనలో అనేక మంది కవులు, మేధావులు చంపబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత దాసోజు శ్రావణ్ మాట్లాడుతూ మోదీ దేశ ద్రోహి అని, ఓటమి భయంతోనే ఫోన్లని ట్యాప్ చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు.
Must Read ;- ఒక్క మిస్డ్ కాల్.. మీ ఫోన్ ను హ్యాక్ చేస్తుంది!
పెగాసిస్ సాఫ్ట్ వేర్‌తో ఫోన్ల ట్యాప్: దాసోజు శ్రావణ్https://t.co/4MFHetZOBI
— ABN Telugu (@abntelugutv) July 22, 2021











