తెలుగు తెరకు ఎప్పటికప్పుడు కొత్త కథానాయికలు పరిచయమవుతూనే ఉంటారు. ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూనే ఉంటారు. స్టార్ డమ్ కోసం సాగే ఈ పరుగుపందెంలో కృతి శెట్టి గట్టెక్కేసింది. ఇక ఆ వెనుక పరిగెత్తుకువస్తున్నవారిలో ముగ్గురు ముద్దుగుమ్మలు ఉన్నారు .. వాళ్లలో ముందుగా మురిపించేదెవరో చూద్దాం.
ఏ భాషలోనైనా సినిమా ప్రధానమైన ఉద్దేశం వినోదాన్ని పంచడమే. అందువల్లనే ఏ ప్రాంతానికి చెందిన ప్రేక్షకులైనా హీరోయిన్ చాలా అందంగా ఉండాలనే కోరుకుంటారు. అందంగా ఉంటేనే ఆదరిస్తారు .. ఆరాధిస్తారు .. ఆమె అభిమానులుగా చెప్పుకుని ఆనందిస్తారు. తెల్లారితే తెలుగు తెరకు చాలామంది హీరోయిన్స్ పరిచయమవుతోనే ఉంటారు. వాళ్లలో ‘ఉప్పెన’తో ఊరించిన కృతి శెట్టి స్థానం ప్రత్యేకమని చెప్పుకోవాలి. అంతటి ఆకర్షణీయమైన హీరోయిన్ ను ఈ మధ్య కాలంలో చూడలేదంటూ కుర్రాళ్లు థియేటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
కృతి శెట్టి తరువాత తెలుగు తెరకి పరిచయమవుతున్న కథానాయికలలో ప్రధానంగా ముగ్గురి గురించి చెప్పుకోవాలి. వాళ్లలో ముందుగా ‘అనన్య పాండే’ గురించి ప్రస్తావించాలి. విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘లైగర్’ ద్వారా ఈ అమ్మాయి పరిచయం కానుంది. నాజూకుదనంతో కూడిన చూపులతో బాలీవుడ్ ప్రేక్షకులను బంధించేస్తున్న ఈ సుందరిపై ఆల్రెడీ ఇక్కడి జనాలు మనసులు పారేసుకున్నారు. ఆ తరువాత స్థానంలో ‘కేతిక శర్మ’ పేరు వినిపిస్తోంది.
ఆకాశ్ పూరి జోడీగా రూపొందిన ‘రొమాంటిక్‘ సినిమాతో ఈ పిల్ల పరిచయం కానుంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ కుర్ర బ్యూటీ ఒకే ఒక్క హాట్ పోస్టర్ తో కుర్రాళ్లకు నిద్ర .. ఆకలి లేకుండా చేసింది. ఇక సినిమా వస్తే తమ పరిస్థితి ఏమిటనే టెన్షన్ టీనేజర్లను వెంటాడుతూనే ఉంది. ఈ ఇద్దరి కోసం వెయిట్ చేస్తూ కుర్రాళ్లు వెయిట్ లాస్ అవుతుంటే, నేను కూడా ఉన్నానంటూ ‘సాక్షి వైద్య’ రంగంలోకి దిగిపోయింది. ‘ఏజెంట్’ సినిమాలో అఖిల్ జోడీగా ఈ అమ్మాయి తెలుగు తెరకి పరిచయమవుతోంది. కృతి శెట్టి తరువాత ఆ స్థాయిలో వీరిలో ఎవరు ప్రభావితం చేస్తారో .. పడుచు మనసులపై ఎవరు పట్టాభిషేకం చేసుకుంటారో చూడాలి.
Must Read ;- పవన్ – హరీష్ మూవీలో కృతిశెట్టి.. ఇది నిజమేనా?