పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీ తో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని తర్వాత పవర్ స్టార్ వరుస సినిమాల్ని లైన్ లో పెట్టుకున్నారు. ఆయన తో సినిమా తీయడానికి నిర్మాతలు క్యూ కట్టారు. అలాగే దర్శకులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో వకీల్ సాబ్ తీసిన నిర్మాత దిల్ రాజు.. ఆయనతో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఆ మేరకు పవర్ స్టార్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు సమాచారం.
పవర్ స్టార్ కి అడ్వాన్స్ ఇచ్చినప్పటి నుంచి సరైన కథకోసం ఎదురు చూస్తున్నారు దిల్ రాజు. ఈ నేపథ్యంలో పవన్ కోసం మంచి కథ రెడీ చేయమని అనిల్ రావిపూడికి చెప్పారట. అనిల్ తన స్టైల్ ను , పవన్ మార్కను మిక్స్ చేసి ఒక కామెడీ ఎంటర్ టైనర్ ను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం వెంకీ, వరుణ్ లతో ఎఫ్ 3 తెరకెక్కిస్తున్న అనిల్ రావిపూడి. దీని తర్వాత బాలయ్యతో కానీ, శర్వానంద్ తో కానీ సినిమా చేయబోతున్నారు. ఆ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో పవర్ స్టార్ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం. గతంలో దిల్ రాజు బ్యానర్ లో అనిల్ .. సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. మరిఈసారి పవర్ స్టార్ తో ఎలాంటి కథను సెట్ చేస్తాడో అనిల్.
Must Read ;-సూపర్, పవర్ స్టార్లు అలా స్పందిస్తేనే హీరోయిజం!