టాలీవుడ్ దర్శకులలో బోయపాటికి ఒక ప్రత్యేకత ఉంది. కథాకథనాలను తయారుచేసుకోవడంలో .. పాత్రలను మలిచే విధానంలో ఆయన తనదైన ముద్రను చూపిస్తారు. ముఖ్యంగా ఆయన తన సినిమాలో మాస్ ఆడియన్స్ కి నచ్చే అంశాలు పుష్కలంగా ఉండేలా చూసుకుంటారు. అందువలన మాస్ ఆడియన్స్ ను అలరించే విధంగానే హీరోయిజాన్ని బిల్డప్ చేస్తూ వెళతారు. ఆయన సినిమాల్లో భారీస్థాయిలో యాక్షన్ ఉన్నప్పటికీ అది ఎమోషన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందువల్లనే ఫ్యామిలీ ఆడియన్సులోను ఫాలోయింగు ఎక్కువే.
బాలకృష్ణకి మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అందువలన బాలకృష్ణతో బోయపాటి చేసిన ‘సింహా’ .. ‘లెజెండ్’ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పుడు ‘అఖండ‘ సినిమా రూపొందుతోంది. దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాతో వీరికి హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా తరువాత ఏ హీరోతో బోయపాటి ప్రాజెక్టు ఉండనుంది? ఎవరితో ఆయన ప్లాన్ చేస్తున్నాడనేది ఆసక్తికరంగా మారింది. అందరూ ఈ విషయాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు.
బోయపాటి తన తదుపరి సినిమాను అల్లు అర్జున్ తో చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సరైనోడు‘ భారీ వసూళ్లను రాబట్టింది. అదే తరహాలో మరో ప్రాజెక్టుకు సన్నాహాలు జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇక తెలుగులో సూర్య హీరోగా చేయనున్న సినిమాకి దర్శకుడిగా బోయపాటి పేరు వినిపించింది. సూర్యకి కథ చెప్పడం .. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని అన్నారు. రీసెంట్ గా విశాల్ పేరు తెరపైకి వచ్చింది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏది నిజం? అనేది అర్థంకాని పరిస్థితి. ఈ విషయంలో బోయపాటినే క్లారిటీ ఇవ్వాలి. అప్పటివరకూ ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టడం కష్టమే!
Must Read ;- ఆఖరి దశలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను ‘అఖండ’











