కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఈరోజు నితిన్ మ్యాస్ట్రో షూటింగ్ స్టార్ట్ చేశాడు. రవితేజ, నాగచైతన్య, సమంత, నిఖిల్.. షూటింగ్ లో పాల్గొనే డేట్స్ ఇవే.
కరోనా సెకండ్ వేవ్ వలన షూటింగ్ లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే.. కరోనా కేసులు తగ్గడంతో షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈరోజు (జూన్ 14) మ్యాస్ట్రో’ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో మొదలైంది. హీరో నితిన్, తమన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ. ఇక మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడి. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకుడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి కావాలి కరోనా కారణంగా ఆగిన ఈ మూవీ షూటింగ్ ను జూన్ 26 నుంచి తిరిగి ప్రారంభించనున్నారు.
ఇక యువ సమ్రాట్ నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం థ్యాంక్యూ. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది.ఇంకా ఓ ఎనిమిది రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ ను తిరిగి జూన్ 21 నుంచి నాగచైతన్య, రాశీఖన్నాల పై చిత్రీకరించనున్నారు. దీంతో షూటింగ్ పూర్తవుతుంది. ఫస్ట్ లుక్ ఆగష్టు లేదా సెప్టెంబర్ లో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
ఇక సమంత నటిస్తున్న తాజా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ను జూన్ 24 నుంచి ప్రారంభించనున్నారు. అన్నపూర్ణ సెవెనె ఏకర్స్ లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్ లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. వీటిత పాటు నిఖిల్ 18 పేజీస్, బెల్లంకొండ గణేష్ మూవీ, సిద్ధూ జొన్నలగడ్డ నరుడు బ్రతుకు నటన చిత్రాల షూటింగ్ ను జూన్ 24 నుంచి ప్రారంభించనున్నారని సమాచారం.
Must Read ;- సమంతకు భారీ ఆఫర్ – సోషల్ మీడియాలో వైరల్