నిన్ను క్షమించం.. మా డబ్బులు ఇవ్వకంటే తిరగనివ్వవం..!
జగన్ రెడ్డి సర్వమోసాలు.., సర్వం మాయలను ప్రజలతోపాటు సొంతసామాజీకవర్గానికి బాగా బోధపడింది. నమ్మి పంచాయతీల్లో పెట్టుబడులు పెట్టి నిండా మునిగాం అని సర్పంచ్ లు.., వైసీపీ నాయకులు.., కార్యకర్తలు.., నేడు ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడించి.. రోడ్డెక్కుతు న్నారు.
గతంలో జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా.. వై నాట్ 175 అంటారు. కానీ నేడు ఆ మాటకు ఆయన దమ్ముంటే కట్టుబడాలని సొంత పార్టీ నేతలే సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి రోజు సొంత పార్టీ నాయకులు.., ప్రజాప్రతినిధులు.., రోడ్డెక్కి జగన్ రెడ్డిని., మంత్రులను.., ఎమ్మెల్యేలను తిడుతుంటే వై నాట్ 175 కాదు.. ఆ 175 మంది నేతలైనా ఆయన పక్కన కనీసం నిలబడతారా..? అన్న అనుమానం అందరిలో తలెత్తుతోంది. మా రెడ్డి.. మా రెడ్డి .. అని తలకెత్తుకున్న పాపానికి రెడ్ల వెన్నువిరిచాడని సొంతపార్టీలోని రెడ్డి సామాజీక వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడెక్కడ డ్యాష్ రెడ్డి రా.. బాబు అంటూ తలలు బాదుకుంటున్నారు. ఉమ్మడి ప్రకాశం.., చిత్తూరు జిల్లాలలో అన్నీమండాలాల్లో రెడ్డి.., బీసీ సామాజీకవర్గానికి చెందిన నేతలు.., సర్పంచ్ లు నేడు రోడ్డెక్కుతున్నారు. నిన్ను నమ్మి.. భార్య పుస్తేలు తాకట్టుపెట్టి.. పేదలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందిస్తే.. ఆ బిల్లులు ఇవ్వకుండా అప్పులు పాలు చేసి..నడి రోడ్డుపై ఊరేసుకునేలా చేస్తావా..? అంటూ జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ఉమ్మడి ప్రకాశం.., చిత్తూరు జిల్లాలు అంటేనే తీవ్ర తాగునీటి ఎద్దడికి పెట్టింది పేరు. కొన్ని మండలాలు మినహా.. దాదాపు అన్నీ మండల, గ్రామ పంచాయతీలో తాగునీటికి కటకటలాడుతోంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని 80 గ్రామ పంచాయతీలకు.., చిత్తూరు జిల్లాలోని 60 గ్రామ పంచాయతీలలో స్థానిక వైసీపీ సర్పంచ్ లు, నాయకులు ప్రజలకు 2019 నుంచి తాగునీటిని సరాఫరా చేస్తున్నారు. దాదాపు 230 కోట్ల వరకు వీటికి సంబంధించిన బిల్లులు బకాయిల రూపంలో పేరుకుపోయాయి. వీటిని ఈ రోజు ఇస్తాం.. రేపే మీ అకౌంట్లో వేస్తాం.. అని మంత్రులు.., ఎమ్మెల్యేలు చెప్తున్న నమ్మపలుకులు విని.. అప్పులు చేసి మరి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించారు వైసీపీ నేతలు. ఇప్పుడు ఆ నమ్మపలుకులే..తమను నట్టేట్లో ముంచాయని నెత్తినోరు కొట్టుకుంటున్నారు.
జగన్ రెడ్డి అంటేనే నరకాసురుడికి ప్యాంటు- షర్ట్ వేసిన మాదిగా ఉంటాడని సొంతపార్టీ నేతలే సోషల్ మాధ్యమాల్లో అవేదన వ్యక్తం చేస్తుంటారు. అది అక్షరాల నిజం. నవ రత్నాలతో నవ మోసాలకు అలవాటు పడ్డ ఆయన హామీలకు ప్రజలతో పాటు చివరికి నమ్మిన సొంత పార్టీ కేడర్ ను కూడా నమ్మి మోసపోయారు. ప్రకాశం జిల్లా, చిత్తూరు జిల్లాలోని కొన్ని మండాలాల్లో పంచాయతీ రాజ్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం నాలుగేళ్లుగా ట్యాంకర్ల ద్వారా తాగునీరును అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దాదాపు 230 కోట్ల పెండింగ్ బిల్లులకు సంబంధించిన నిధులను ఈ ఏడాది జూన్ 28న నాలుగొవ విడత అమ్మబడి నిధులు బట్ నొక్కె కార్యక్రమంలో తోపాటు వీటిని నొక్కాడు. దీంతో నాలుగేళ్ళుగా పెండింగ్ లో ఉన్న తాగునీటి బిల్లులు పడ్డాయని.., నేతలు సంబరాలు చేసుకున్నారు.
వీటికి సంబంధించిన ప్రతులను.., రిపోర్టులను సిద్ధంచేసి.. పంచాయతీరాజ్ శాఖకు ఎంతో సంబరంగా సమర్పించారు. అంబరాన్ని తాకిన సంబరంతో బిల్లుల విడుదలకు సహకరించిన ఉన్నతాధికారులకు సైతం ముడుపులు సర్పించారు. లంచాలను కూడా లక్షల్లో అందించారు. ఆ తరువాత జగన్ రెడ్డి తాడేపల్లి కొంప నుంచి రెడ్ బటన్ నొక్కారు. ఇంకేముంది తాగునీటిని అందించిన ప్రజాప్రతినిధులు.., నాయకుల ఆశలు ఒక్కసారిగా రివర్స్ గేరేశాయి. దీంతో పంచాయతీ రాజ్ అకౌంట్లు ఉన్న 230 కోట్లు తిరిగి లాగేసుకున్నాడు జగన్. తిరా.. బిల్లులు పెట్టికున్న నేతలకు ఈ విషయం తెలిసి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయింది. ఇదేక్కడి మోసం రా .. బాబు అంటూ ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలోని వైసీపీ సీనియర్ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంకర్లతో పంచాయతీరాజ్ కార్యాలయాన్ని ముట్టడించారు. నాలుగేళ్లుగా బిల్లులు పెండింగ్ లో పెడితే అప్పులు చేశాం. తిరా నిధులు విడుదల చేసి.. బిల్లులు పెట్టుకునే సమయానికి వాటిని లాగేసుకోవడం ఎంటని.. యర్రగొండ పాలెం వైసీపీ నాయకులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. ఒక్క నెలలోకూడా బిల్లులు పెండింగ్ లో పెట్టలేదని.. క్రమం తప్పకుండా వాటిని చెల్లించారని వైసీపీ నేతలు.., జగన్ బాధిత రెడ్లే మీడియా ముందు చెప్పి గోడు వెల్లబుచ్చుకున్నారు. జగన్ ను, మంత్రి సురేష్ ను నమ్మి కోట్లల్లో అప్పులు చేసి.. యర్రగొండ పాలెంలోని 5 మండలాలో 80 గ్రామాలకు తాగునీటిని ట్యంకర్ల ద్వారా సరాఫరా చేసి నిలువున మోసపోయామని విలపించారు. పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయకుంటే భవిష్యత్తు కార్యాచరణ.., మూకుంబడి రాజీనామాలు.., తాడేపల్లి సీఎం నివాసం ముట్టడి వంటి వాటికి సైతం వెనుదిరగమని వారు హెచ్చరించారు.