‘అందాల రాక్షసి’ అనే పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు లావణ్య త్రిపాఠి. ఎందుకంటే ఆ సినిమాతోనే ఆమె తెలుగు తెరకి పరిచయమైంది. తగినంత హైటూ .. అందుకు తగిన పర్సనాలిటీతో ఆకర్షణీయంగా అనిపిస్తుంది. కోల కళ్లతో .. ఊరించే పెదాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. తామరాకులా సున్నితంగా .. సుకుమారంగా కనిపించే ఈ అమ్మాయి కెరియర్లో, ‘భలే భలే మగాడివోయ్’ .. ‘సోగ్గాడే చిన్నినాయనా‘ వంటి భారీ హిట్లు ఉన్నాయి. లాక్ డౌన్ కి ముందు కూడా ఆమె ‘అర్జున్ సురవరం’తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.

అయితే లావణ్య త్రిపాఠి తన అందచందాలను ఆవిష్కరించే రోల్స్ పూర్తి స్థాయిలో పడలేదనే అసంతృప్తిని చాలా కాలంగా వ్యక్తం చేస్తోంది. కానీ ఆ తరహా పాత్రలు ఆమెకి పడటం లేదు. ఎక్స్ పోజ్ చేసే పాత్రలకు ఆమె సెట్ కాదని అనుకున్నారేమో .. కాస్తంత పద్ధతిగా కనిపించే పాత్రలనే ఇస్తూ వస్తున్నారు. అలాంటివాళ్ల అభిప్రాయాన్ని మార్చడానికి అన్నట్టుగా, అప్పుడప్పుడు హాట్ లుక్స్ తో కూడిన ఫొటోలను వదులుతూ, పడుచు బుర్రలకు పని పెడుతూనే ఉంటుంది. ఉత్సాహంతో కూడిన వాళ్ల ఊహలకు క్లాప్ కొడుతూనే ఉంటుంది.
అలాంటి ఫొటో ఒకటి తాజాగా ఆమె షేర్ చేసింది. ఈ ఫొటోలో డిజైనర్ ఫ్రాక్ లో .. తెల్లని మేనిఛాయతో ఆమె మిలమిల మెరిసిపోతోంది. కోటి కోరికలను నింపుకున్నట్టుగా కనిపించే కళ్లతో .. అందమైన పెదవులను పొందినట్టుగా గర్విస్తున్న పెదవులతో మత్తెక్కిస్తోంది. ఆమె లావణ్య విశేషాలు అందానికే అసూయ పుట్టిస్తున్నాయి .. మనసు మైదానంలో కలలు కోటలు కట్టిస్తున్నాయి. ఇలాంటి హాటు లుక్కులతో లావణ్య తాను అనుకున్నది సాధిస్తుందేమో చూడాలి. ఈ ఏడాది ఆమె ‘చావుకబురు చల్లగా’ .. ‘A 1ఎక్స్ ప్రెస్’ సినిమాలతో పలకరించనున్న సంగతి తెలిసిందే.
Must Read ;- ట్రైలర్ టాక్ : క్రీడా రాజకీయంపై ఓ యువకుని పోరాటం ‘ఎ1 ఎక్స్ ప్రెస్’











