పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ పరం గా జోరు మీద ఉన్నారు. వకీల్ సాబ్ ‘ ఏప్రిల్ -9 న విడుదల కాబోతుంది .” అయ్యప్పనుమ్ కోషియుమ్ ” రీమేక్ షూటింగ్ శరవేగం తో జరుగుతోంది. సెప్టెంబర్ లో విడుదల చేస్తారని టాక్. ఆ తర్వాత క్రిష్ సినిమా షూటింగ్ జరగబోతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్ట్స్ అన్నిటి కన్నా , హరీష్ శంకర్ దర్శకత్వం లో వచ్చే సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా షూటింగ్ జూన్ నుంచి మొదలు కాబోతుంది . మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించబోతున్నారు. అయితే హరీష్ శంకర్ సినిమా ముందు రిలీజ్ అవుతుందా – క్రిష్ సినిమా రిలీజ్ అవుతుందా అనేది ఇంకా నిర్ణయం కాలేదు .
Must Read ;- పవన్ టైటిల్ విరూపాక్షి కాదు.. వీరమల్లు