అను ఇమ్మాన్యుయేల్ అమెరికాలో పుట్టిన మలయాళ ముద్దుగుమ్మ. మరో బ్యూటీ అతుల్య రవి తమిళనాడులోని కోయంబత్తూరులో పుట్టింది. వీరిద్దరూ మంచి నటీమణులు. ఇద్దరికీ సౌత్ ఇండియాలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు. వారికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఫాన్స్ తో పంచుకుంటారు.
హాట్ నెస్ ఒలికించడంలోనూ, గ్లామరస్ రోల్స్ పండించడంలోనూ అను, అతుల్య ఇద్దరికిద్దరే. అంతేకాదు ఈ ఇద్దరి శరీర లావణ్యం ఒకే విధంగా ఉంటుంది. అందుకే వీరిద్దరి మధ్య ఐదు ముఖ్యమైన పోలికలు ఉన్నాయని వారి ఫాన్స్ అభిప్రాయ పడుతున్నారు..
ముక్కుపుడక సౌందర్యం
అను ఇమ్మాన్యుయేల్ ఎక్కువగా ముక్కు పొడక ధరిస్తుంది. కాని అతుల్య రవి ఎప్పుడూ ముక్కు పొడక పెట్టుకున్నట్లు మనకు కనిపించలేదు. అయితే అతుల్య అభిమానులు మాత్రం ఆమె ఫోటో తీసుకోని దానిని డిజిటైజ్ చేసి ముక్కు పొడక తగిలించారు. ఆ ఫోటోలలో ఆమె అచ్చం అను ఇమ్మాన్యుయేల్ వలే ఉందని ఫాన్స్ అంటున్నారు. ముక్కు పొడకతో వీరిద్దరూ ఉన్న ఫోటోను పక్క పక్కన అతికించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు.
Must Read ;- గ్లామర్ టాప్ లేపిన బోల్డ్ బ్యూటీ పాయల్
అందమైన చిరునవ్వు
చాలా మంది కథానాయికలు నవ్వితే ఎంతో అందంగా ఉంటుంది. అను, అతుల్య ఇద్దరూ కూడా అందులోనే తమ అందాన్నంతటినీ రంగరిస్తారు. ఆ ఇద్దరూ ఒకేలాంటి నవ్వుతో ఫోటోలు దిగారు. అవి సేకరించిన అభిమానులు ఆ ఫోటోలను పక్క పక్కన పెట్టి ఇద్దరూ ఒకలాగే కనపడుతున్నారని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
తెల్ల చీర చందమామలు
అను ఇమ్మాన్యుయేల్, అతుల్య వేరు వేరు సందర్భాల్లో తెల్ల చీరను ధరించారు. ఆ చీరాలలో ఆ ఇద్దరూ చాలా సహజంగా, అభిమానులు పండుగ చేసుకొనే తీరులో ఉన్నారు. ఈ ఫోటోలలో వీరి పోలికలు ఒకేలా ఉన్నాయని అంటున్నారు అభిమానులు. అలాగే ఇద్దరి హెయిర్ స్టైల్, నడక ఒకే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను కూడా ఫాన్స్ పోస్ట్ చేశారు.
సైడ్ పోజెస్ లో కూడా ఒకటే సామ్యం
మరో ఫోటో పోస్ట్ చేసిన అభిమానులు సైడ్ పోజు బ్యాక్ గ్రౌండ్ ఫోటోలలో కూడా వీరిద్దరూ ఒకే విధంగా ఉన్నారని అంటున్నారు. వీరి ముఖాలు, ఆహావభావాలు ఒకేలా ఉన్నాయని తెగ పండుగ చేసుకుంటున్నారు.
నల్ల చీరలో మిలమిలా…
అను ఇమ్మాన్యుయేల్, అతుల్య ధరించిన నల్ల రంగు చీరాలలో కూడా వీరిద్దరి పోలికలు దగ్గరగా ఉన్నాయి. అందుకు సంబంధించిన ఒక ఫోటోను పోస్ట్ చేసారు ఫాన్స్. ఇందులో వారి పేస్ వ్యక్తీకరణ విరుద్ధంగా ఉన్నా వారిద్దరి రూపురేఖలు ఒకలాగే ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. చూసినవారందరూ నిజమే కదా అని అంటున్నారు.
Also Read ;- త్వరలో హనీమూన్ కు నీహారిక దంపతులు