సంపత్ రాజ్ .. తెలుగు తెరపై విలక్షణమైన విలనిజం. విలన్ గా ఆయన తెరపై హడావిడి చేయడు .. భారీ డైలాగులు చెప్పడు. కేవలం కంటిచూపులతోనే తనలోని విలనిజాన్ని ఆయన ఆవిష్కరిస్తాడు. బాడీలాంగ్వేజ్ తోనే సన్నివేశాలను పండిస్తాడు. తనకి ఇచ్చిన పాత్రలో ఆయన ఇమిడిపోవడానికిగల కారణం .. ఆయనకి గల సుదీర్ఘమైన అనుభవం. 2003లోనే నటుడిగా ఆయన ప్రయాణం మొదలైంది. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న తరువాత 2011లో ఆయన టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు.
పవన్ కల్యాణ్ హీరోగా చేసిన ‘పంజా’ సినిమా ద్వారా తెలుగులో ఆయన ఇంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా, నటనపరంగా సంపత్ రాజ్ చూపిన కొత్తదనం ఆడియన్స్ కి నచ్చింది. దాంతో తెలుగులోను ఆయనకి వరుస అవకాశాలు రావడం మొదలైంది. ‘మిర్చి‘ .. ‘లౌక్యం’ .. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ .. ‘శ్రీమంతుడు’ సినిమాలు ఆయన క్రేజ్ ను అమాంతం పెంచేశాయి. ‘సోగ్గాడే చిన్నినాయనా’ .. ‘రాజా ది గ్రేట్‘ .. ‘భీష్మ’ .. ఇలా అనేక విజయాలు ఆయన ఖాతాలో నమోదవుతూనే ఉన్నాయి. తెలుగులో ఆయన ఎంత బిజీగా ఉన్నాడో .. ఇతర భాషల్లోను అంతే బిజీగా ఉండటం విశేషం.పవన్ కల్యాణ్
అయితే నటుడిగా తన బిజీ లైఫ్ వల్లనే వైవాహిక జీవితంలో సక్సెస్ కాలేకపోయాననేది సంపత్ రాజ్ మాట. “నటన అంటే నాకు ఎంతో ఇష్టం .. నా అంకితభావానికి తగిన గుర్తింపు లభించి నేను బిజీ అయ్యాను. అయితే నా భార్య నుంచి మాత్రం నాకు ఎలాంటి సపోర్ట్ లభించలేదు. నన్ను అర్థం చేసుకునేంత మానసికంగా ఆమె ఎదగలేదు. అందువల్లనే విడాకులు తీసుకోవలసి వచ్చింది. విడాకులు తీసుకున్నాం కదా అని నేను ఆమెను దూరం పెట్టలేదు .. ఇప్పటికీ ఆమెతో ఒక స్నేహితుడిగా ఉంటాను. ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాను. మా ఇద్దరి గుర్తుగా ఐదేళ్ల పాప ఉంది .. పాప ఆలనా పాలన నేనే చూస్తున్నాను. మరో పెళ్లి చేసుకుంటే నాకు భార్య వస్తుంది .. కానీ పాపకి తల్లి కాలేదు కదా? అందుకే నేను మరో పెళ్లి చేసుకోలేదు” అని చెప్పుకొచ్చాడు.
Must Read ;- పవన్ ‘పోలెనా’ ఆ కళ్లు, ఆ నడక.. సేమ్ టు సేమ్