బాలీవుడ్ నటి తారా సుతారియా ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలనటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆతర్వాత సీరియల్స్ లో మంచి పాత్రలను పోషించి అనతికాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె మొదటి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా నటన, అందం, గ్లామర్ కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. సినిమాల విషయం పక్కన పెడితే ఈ బ్యూటీ తన ఫ్యాషన్, స్టైల్‌తో కుర్రాకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఆమె ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
తన పాత, కొత్త ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంది. తాజాగా తారా ఒక సెల్ఫీ ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. దీనిలో ఆమె తెలుపు రంగు టాప్‌లో గజిబిజిగా ఉండే హెయిర్ స్టైల్ తో అదిరిపోయే విధంగా కనిపిస్తుంది. తన సెక్సీ లుక్స్ తో చాలా హాట్ గా కనబడుతోంది. మేకప్ లేకుండా మరియు జుట్టును గాలికి వదిలేసి ఉండడం, ఆమె తీసుకున్న సెల్ఫీలో చర్మ సౌందర్యాన్ని ప్రదర్శించడంతో తారా ఒక అందాల దేవతలా కనిపించింది. అంతేకాకుండా మాల్దీవుల్లో ఆమె ఈ సెల్ఫీ ఫోటోను తీసుకుంది అని సూచించడానికి తారా రెండు తాటి చెట్ల ఎమోటికాన్లను ఉంచింది.
తారా తరుచూ ఇలాంటి సెల్ఫీ పిక్స్ ను అభిమానులతో పంచుకుంటుంది. అసలే ఇన్ స్టా గ్రామ్ లో ఆమెకు 20లక్షల ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె పోస్ట్ చేసిన ప్రతీ ఫోటోకు విపరీతమైన స్పందన వస్తుంది. అలాగే ఈ ఫొటోకు కూడా భారీ స్పందన వచ్చిందనే చెప్పాలి. ఆమె అభిమానుల్లో కొందరు మగవాళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటావా అని చిలిపిగా తారాను అడుగుతున్నారు. ఆమె చివరిగా ‘మర్జావాన్’ చిత్రంలో సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి నటించింది. ప్రస్తుతం తారా ‘RX100’ హిందీ రీమేక్ లో నటిస్తోంది.
Must Read ;- ఇంటర్ వ్యూలో వర్మ యాంకర్ ఆరాచకం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!