బాలీవుడ్ లో జాన్వి కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీదేవి కూతురు అందాల జాన్వీ కపూర్.. తొలి చిత్రం ‘ధడక్’ తో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఆమె ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం అనేకమంది టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం తన ద్రుష్టి మొత్తం బాలీవుడ్ సినిమాలపైనే పెట్టినట్లు తెలుస్తోంది.
ఇదిలాఉంటే… రీసెంట్ గా జాన్వి కపూర్ తండ్రి, సోదరితో కలిసి ఒక ఫంక్షన్ కు హాజరైయ్యారు. ఆ ఫంక్షన్ లో ఆమె సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచింది. జాన్వీ గులాబీ లెహెంగా ధరించింది. ఆ డ్రెస్ కు సరిపడా గోల్డ్, వెండి రంగు కలగలిసిన ముత్యాల హారాన్ని మెడకు ధరించి, గులాబీ బ్యాగ్ ను చేతితో పట్టుకొని కనిపించింది. అంతేకాకుండా చెవులకు తెలుపు రంగు ముత్యాలతో తయారు చేసిన చెవి దుద్దులను, అందమైన హెయిర్ స్టైల్ పై తెలుపు రంగు పువ్వులు ధరించి అందాల దేవత లా దర్శనమిచ్చింది.
ఇక జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విషయానికి వస్తే ఆమెకు బాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అమ్మడు అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయింది. ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా వివాహానికి వెళ్ళినప్పుడు .. గులాబీ రంగు లెహెంగా ధరించి యువరాణిలా కనిపించింది. అలాగే చెవులకు తెలుపు రంగు ముత్యాల చెవి దుద్దులు, పెదాలకు గులాబీ రంగు లిప్స్ స్టిక్, జడను అందంగా అల్లి చివరన రంగు రంగుల జడ గంటలను ధరించి కనపడింది. వీరిద్దరూ ఒకే రంగు దుస్తులు ధరించడంతో వీరిలో ఎవరు అందంగా ఉన్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. తమ అభిమాన హీరోయిన్ అందంగా ఉంది అంటే కాదు కాదు మా హీరోయిన్ బాగుంది అంటూ ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. అదీ సంగతి.
https://www.youtube.com/watch?v=XIrSJKuT4UA










