యంగ్ హీరో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ఏ 1 ఎక్స్ ప్రెస్. ఈ చిత్రానికి డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్ గా రూపొందుతోన్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టర్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 26న రిలీజ్ చేయనున్నట్టు ఎనౌన్స్ చేశారు.
ఈ సందర్భంగా ఏ 1 ఎక్స్ ప్రెస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ట్రైలర్ ఎలా ఉందంటే.. హాకీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీలో హాకీ ప్లేయర్ గా సందీప్ కిషన్ లుక్ బాగుంది. ఏ స్పోర్ట్స్ చూడాలో.. ఏ స్పోర్ట్స్ చూడకూడదో బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తున్నాడు.. అసలు ఆడాలంటేనే ఎంతో కొంత డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని సందీప్ కిషన్ చెప్పిన డైలాగ్స్ ను బట్టి స్పోర్ట్స్ వెనకున్న రాజకీయాల గురించి.. ఈ కథలో చెబుతున్నట్టు తెలుస్తుంది.
ఇందులో లావణ్య త్రిపాఠితో రొమాంటిక్ యాంగిల్ కూడా చూపించాడు. లవ్, ఎమోషన్, సెంటిమెంట్.. ఇలా యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఈ సినిమాని తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. సందీప్ కిషన్ 25వ చిత్రంగా.. టాలీవుడ్‌లో రూపొందుతోన్న తొలి హాకీ ఫిల్మ్‌గా గుర్తింపు పొందిన ఈ మూవీకి హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు. మొత్తానికి ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏ 1 ఎక్స్ ప్రెస్ ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేసిందని చెప్పచ్చు. మరి.. ఫిబ్రవరి 26న రానున్న ఏ 1 ఎక్స్ ప్రెస్ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Must Read ;- సందీప్ కిషన్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం