‘అందాల రాక్షసి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు నాని ‘భలే భలే మగాడివోయ్’ సినిమాతో మొదటి బ్లాక్ బస్టర్ అందుకుంది. అక్కినేని నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాతో టాప్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరిపోయింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది లావణ్య. ఇప్పటికే ఆమెకు ట్విట్టర్ లో వన్ మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అక్కడ మాత్రమే కాకుండా ఫేస్ బుక్ లో కూడా ఈ అమ్మడుకి 2.6 మిలియన్ల ఫాలోవర్లు.
ఇక ఆమె ఇన్ స్టాగ్రామ్ లో అయితే రెండు మిలియన్ల ఫాలోవర్లకు దగ్గరలో ఉంది. ప్రస్తుతం 1.9 మిలియన్స్ కు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. కొద్ది రోజుల్లోనే అది 2 మిలియన్స్ కు చేరువకానుంది. ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది లావణ్య త్రిపాఠి. అందువలనే ఈమెకు తక్కువ టైంలోనే ఎక్కువ మంది ఫాలోవర్లు పెరిగారు.
లావణ్య ప్రస్తుతం హీరో కార్తికేయతో ‘చావు కబురు చల్లగా’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను గీత ఆర్ట్స్ – 2 సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ఆమె పాత్ర సరికొత్తగా ఉండబోతోంది. అలాగే సందీప్ కిషన్ తో ‘ఏ1 ఎక్ష్స ప్రెస్’ సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్లు చివరి దశకు చేరుకున్నాయి. అంతేకాకుండా మరో రెండు సినిమాలను ఈ అమ్మడు లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. మరి లావణ్య సోషల్ మీడియాలో ఇంకెంతగా తన ఫాలోవర్స్ ను పెంచుకుంటూ పోతుందో చూడాలి.
Must Read ;- విక్రమ్ కథ విభిన్నం .. రాత్రి సమయాల్లోనే షూటింగ్











