ఒకప్పుడు బికినీలకు కేరాఫ్ అడ్రస్ ఆమె. బీచ్ లో ఫొటోలు దిగిన ఆమె అందాల్ని చూసేందుకు కుర్రకారు ఎగబడేవారు. కవర్ పేజీపై ఆమె ఫొటో పడితే మ్యాగజైన్ అమ్మకాలు అమాంతం పెరిగిపోయేవి. అలా కుర్రాళ్లను పిచ్చెక్కించిన అందగత్తె మినీషా లాంబా, ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. ఆమె మరోసారి ప్రేమలో పడింది.
2015లో రియాన్ థామ్ అనే నైట్ క్లబ్ ఓనర్ తో లవ్ లో పడింది మినీషా లాంబా. 8 నెలలు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ల వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. ప్రస్తుతం తను రియాన్ తో కలిసి ఉండడం లేదంటూ 2018లోనే ప్రకటించింది మినీషా లాంబా. అలా మూడేళ్లుగా ఒంటరిగా ఉంటున్న ఈ బ్యూటీ, ఇప్పుడు మరోసారి ప్రేమలో పడింది. అయితే ఈసారి ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు.
“అవును.. ప్రస్తుతం నేను ప్రేమలో ఉన్నాను. ఓ లవ్లీ పర్సన్ నా జీవితంలో ఉన్నాడు. జీవితం ఇప్పుడు బాగుంది. నా రిలేషన్ షిప్ ఇప్పుడు బాగుంది. ఓ విషయం చెప్పాలి. రిలేషన్ షిప్ లేదా వైవాహిక జీవితం ముగిసిపోయిందంటే దానర్థం జీవితమే ముగిసిపోయిందని కాదు. మళ్లీ ప్రేమలో పడడానికి ఇంకో అవకాశం దక్కినట్టు. పాత జ్ఞాపకాల్ని మరిచిపోవాలి, మరోసారి ప్రేమలో పడాలి.”
వైవాహిక జీవితం బాగాలేనప్పుడు విడిపోవడమే కరెక్ట్ అంటోంది మినీషా. ఇబ్బందిపడుతూ సంసారం సాగించేకంటే కష్టమైనా విడాకులు తీసుకోవడం ఉత్తమం అంటోంది. రియాన్ తో విడాకులు తీసుకున్న అంశంపై స్పందిస్తూ, విడిపోయినందుకు తనకు ఎలాంటి బాధ లేదంటోంది మినీషా.
“జీవితం సాగిపోవాలి. ఆనందంగా ఉండడం ముఖ్యం. జీవితంలో ఏదైనా వర్కవుట్ అవ్వనప్పుడు, దాన్ని వీలైనంత తొందరగా మరిచిపోయే ప్రయత్నం చేయాలి. ఈ కాలం మహిళలకు కూడా ఆప్షన్లు ఉన్నాయి. ఒకప్పుడు వైవాహిక జీవితం నిలబెట్టడానికి మహిళలే తీవ్రంగా శ్రమించేవారు. కానీ ఇప్పుడలా ఇబ్బంది పడుతూ జీవించాల్సిన అవసరం లేదు. సొంత కాళ్లపై నిలబడగలిగే ఏ మహిళైనా సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు.”
కిడ్నాప్, దస్ కహానియే, శౌర్య, యాహాన్, ఆంటోనీ కౌన్ హే లాంటి సినిమాలతో ఎట్రాక్ట్ చేసిన మినీషా లాంబా.. కెరీర్ ఓ మోస్తరుగా సాగుతున్న టైమ్ లోనే సినిమాలు వదిలేసింది. 2019లో ఆమె బాలీవుడ్ నుంచి పోకర్ గేమ్స్ కు షిఫ్ట్ అయింది. ప్రొఫెషనల్ పోకర్ ప్లేయర్ గా మారింది. వరల్డ్ వైడ్ జరిగే పోకర్ టోర్నమెంట్స్ లో కూడా పాల్గొంటోంది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదంటున్న ఈ బ్యూటీ, ఆనందంగా ఉండడం ఒక్కటే మన చేతిలో పని అంటోంది.
Must Read ;- హీరోయిన్ వనిత నాలుగో పెళ్లి చేసుకోబోతోందా?











