సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ల ముద్దుల తనయుడు గౌతమ్ స్విమ్మింగ్‌లో రికార్డ్ సాధించాడు. తన వయసు గ్రూపులో తెలంగాణలో టాప్ 8 స్విమ్మర్లలో ఒకడిగా గౌతమ్ నిలవడం విశేషం. ఈ విషయాన్ని నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. 2018లో ప్రొఫెషనల్ స్విమ్మింగ్‌లో అడుగుపెట్టిన గౌతమ్.. రెండేళ్లలోనే అందులోని మెళకువలను అవపోసన పట్టాడు. స్విమ్మింగ్‌లోని బట్టర్‌ఫ్లై ,బ్రెస్ట్ స్ట్రోక్, ఫ్రీస్టైల్, బ్యాక్‌స్ట్రోక్ విభాగాల్లో మంచి నైపుణ్యం సాధించాడు. ఈ విషయాన్ని తెలియచేస్తూ.. గౌతమ్ స్విమ్మింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
నమ్రతా గౌతమ్ గురించి పోస్ట్ చేసిన ఈ వీడియో చూసిన మహేష్ అభిమానులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. గౌతమ్.. 1 నేనొక్కడినే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో చిన్నప్పటి మహేష్ బాబు పాత్రను పోషించారు. మహేష్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా ఆశించిన స్ధాయిలో కమర్షియల్ సక్సస్ సాధించకపోయినా మంచి పేరు తీసుకువచ్చింది. అయితే.. గౌతమ్ స్విమ్మింగ్ పై ఇంట్రస్ట్ చూపిస్తుండడం ఆసక్తిగా మారింది.
ఇక మహేష్ సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్నారు. మహేష్ – కీర్తి సురేష్ జంటా నటిస్తున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. త్వరలో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 2022 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
Must Read ;- గౌతమ్ , సితార ఈతలో ఏమి హాయిలే ఇలా..