ప్రముఖ నటుడు విజయ్ కుమార్, నటి మంజుల దంపతుల ముద్దుల కూతురు వనితా విజయ్ కుమార్ నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. తెలుగులో దేవి సినిమాలో పాత్రకు తగ్గట్టుగా నటించి మెప్పించారు. తన ప్రతిభతో చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే… కెరీర్ సంతృప్తిగా సాగుతున్న టైమ్ లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వనితకు ఏమాత్రం కలిసి రాలేదు. భర్తతో విడాకులు తీసుకున్నారు. ఆతర్వాత రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి కూడా అంతే. ఇద్దరికీ సెట్ కాకపోవడంతో మళ్లీ విడాకులు. ఈమధ్య ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు.
ఈ పెళ్లితో అయినా లైఫ్ సెట్ అవుతుంది అనుకుంటే… ఇదీ అలాగే జరిగింది. ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు వనిత. ఎందుకనో.. వివాహ బంధం ఆమెకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది.అయితే.. ఇప్పుడు నాలుగో పెళ్లి చేసుకోనుందని ప్రచారం మొదలైంది. ప్రచారంలో ఉన్న వార్తల పై వనిత కాస్త ఘాటుగానే స్పందించింది. ఇంతకీ ఆమె ఏమన్నారంటే.. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక పై పిల్లలే నా జీవితం. గతంలో చేసిన తప్పులు ఇక చెయ్యను. నా వ్యక్తిగత జీవితం గురించి తప్పుడు వార్తలు రాయద్దు. ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను.
ఇక పై ఇలాగే ఉంటాను. దయచేసి, నా జీవితం గురించి అసత్య వార్తలు ప్రచారం చేయకండి. అలాగే ప్రచారంలో ఉన్న వార్తలు నమ్మకండి. నా జీవితం ఎవ్వరికీ సమస్య కాదు. ఈ సమాజంలో ప్రతి ఒక్కరికీ ఏదో రకమైన సమస్యలు ఉంటాయి. వాటి గురించి ఆలోచించండి. నా గురించి కాదు. ఇలాంటి వార్తలు సృష్టిస్తున్న వాళ్లు.. మీ గురించి మీ జీవితం గురించి ఆలోచించండి. నా గురించి ఆలోచించడం అనవసరం. అని వనితా విజయ్‌కుమార్ కాస్త గట్టిగానే సమాధానం ఇచ్చారు.
Must Read ;- పెళ్లిళ్ల పేరుతో లేడీ కానిస్టేబుల్ టోకరా : బడాబాబులను ట్రాప్ చేస్తూ.. డబ్బులు గుంజుతూ!











