టాలీవుడ్ లో మళ్లీ పెళ్ళి సందడి మొదలైంది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరుగా సినీ సెలబ్రిటీస్ పెళ్ళి పీటలెక్కుతున్నారు. దిల్ రాజు నుంచి సుమంత్ అశ్విన్ వరకూ చాలా మంది తమ పెళ్ళితో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ముద్దుగుమ్మ మెహ్రీన్ కూడా త్వరలోనే తన మనసుకు నచ్చిన వాడిచేత మూడు ముళ్ళు వేయించుకోనుంది. ఇంతకు ముందే మెహ్రీన్ అతగాడి ఫోటో ను తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేయగా.. ఇప్పుడు మరోసారి కాబోయే భర్తతో సోషల్ మీడియాలో మెరిసింది.
నానీ కృష్ణగాడి వీరప్రేమగాథతో కథానాయికగా టాలీవుడ్ లో మెరిసిన అందాల మెహ్రీన్ .. అనిల్ రావిపూడి ఎఫ్ 2 లో హనీ గా అదరగొట్టింది. అంతకు ముందే అనిల్ మరో సినిమా అయిన ‘రాజా ది గ్రేట్’ లో రవితేజ సరసన హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈ సుందరి .. అనిల్ తాజా సినిమా ‘ఎఫ్ 3’ లో కూడా నటించనుండడం విశేషం. ఈ మూవీ తర్వాత అమ్మడు సినిమాలకు గుడ్ బై చెబుతుందో లేదో తెలియదు కానీ.. ఆమె పెళ్ళి చేసుకోనుండడం అభిమానుల్ని కాస్తంత నిరాశకు గురిచేస్తోంది.
హర్యానాకి చెందిన మాజీ ఎం.పీ తనయుడు భవ్య బిష్ణోయ్ ను వివాహం చేసుకోబోతోంది మెహ్రీన్ . ఈ నెల 12న హర్యానా లో వీరి ఎంగేజ్ మెంట్ జరగనుంది. గత కొంతకాలంగా ఈ జంట డేటింగ్ లో ఉన్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంతో త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మెహ్రీన్ షేర్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Must Read ;- అందాల హనీ.. మెహ్రీన్ ఏమైపోయిందబ్బా?