ఇవాళ(గురువారం) ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నయి. అయితే ఏపీ సీఎం జగన్, మంత్రులు మరికొందరు మాస్కులు లేకుండానే అసెంబ్లీకి వెళ్లారు. కరోనా విరుచుకుపడుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు చెప్పాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులే ఇలా చేయడం విమర్శలకు దారి తీస్తోంది. మాస్క్ నిబంధనలు ప్రజలకేనా..? సీఎం జగన్, మంత్రులకు వర్తించవా? సామాన్యులు, ప్రతిపక్షాల పార్టీల నాయులు మండిపడుతున్నారు.
ముఖ్యమంత్రే మాస్క్ పెట్టుకోకపోతే : నారా లోకేశ్ ఆగ్రహం
మాస్క్ ధరించడం తప్పనిసరి అని మీ ఫోటో, పేరుతో కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చిన మీరు మాస్క్ ధరించకుండా ప్రజలకు ఏం సంకేతాలిస్తున్నారు? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోకపోతే, ఇక మంత్రులూ, ఎమ్మెల్యేలూ మాస్కులెందుకు ధరిస్తారు? అని ప్రశ్నించారు. సెకండ్‌వేవ్‌లో రాష్ట్రం శ్మశానంగా మారుతుంటే చిరునవ్వులు చిందిస్తూ, ఇంకెన్ని వేలమంది ప్రాణాలు పణంగా పెడతారని నారా లోకేశ్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Must Read ;- చంద్రబాబు పాలన చూసి జగన్ నేర్చుకోవాలి : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై దేవినేని ట్వీట్
ముఖ్యమంత్రి గారూ! మాస్క్ ధరించడం తప్పనిసరి అని మీ ఫోటో, పేరుతో కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చిన మీరు మాస్క్ ధరించకుండా ప్రజలకు ఏం సంకేతాలిస్తున్నారు? ముఖ్యమంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోకపోతే, ఇక మంత్రులూ, ఎమ్మెల్యేలూ మాస్కులెందుకు ధరిస్తారు? (1/3) pic.twitter.com/cpDVwgzv0A
— Lokesh Nara (@naralokesh) May 20, 2021











