ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యాలయం దగ్గర దంపతులు ఆత్మహత్య ప్రయత్నం చేయడం కలకలం రేపింది. తాడేపల్లిలో పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన నరేశ్, సరస్వతి దంపతులు బుధవారం తాడేపల్లిలోని సీఎం జగన్ కార్యాయానికి వచ్చారు. ఆర్థిక సమస్యలు వెంటాడటంతో జగన్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సీఎంను కలవాలని సెక్యూరిటీ సిబ్బందిని కోరారు. అయితే కరోనా కారణంగా చెక్ పోస్టు వద్ద ఆపేశారు. రిక్వెస్ట్ లెటర్ ఇస్తే, సీఎంకు అందిస్తామని తెలిపింది. అప్పటికే పెట్రోల్ బాటిల్ తో అక్కడికి చేరుకున్న దంపతులు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించారు. అక్కడున్న సిబ్బంది వెంటనే అలర్ట్ అయి అడ్డుకున్నారు. ఈ సంఘటనతో క్యాంపు క్యారాలయ సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
Must Read ;- జగన్ బెయిల్ రద్దుపై విచారణ 26కి వాయిదా










