కరోనా కేసులు పెరుగుతున్నా, తన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాడు తాడిపత్రికి చెందిన కానిస్టేబుల్ గణేశ్. తన ఆరోగ్యం సహకరించకపోయినా డ్యూటీని మాత్రం వదల్లేదు. దీంతో కరోనా బారిన పడ్డాడు. టెస్టు చేయించుకోవడంతో, స్వల్ప లక్షణాలు ఉన్నాయని తేలింది. తాను కరోనా బారిన పడ్డట్టు, సెలవు ఇవ్వాలని ఎస్ఐ ని కోరగా, లక్షణాలు ఉన్నా సరే డ్యూటీకి రావాల్సిందేనని ఎస్ ఐ ఆదేశాలు జారీ చేశారు. గత్యంతర లేక విధులకు హాజరయ్యాడు. ఈ క్రమంలో ఆక్సిజన్ లెవల్ పడిపోవడంతో కానిస్టేబుల్ ను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ‘‘తనకు కరోనా ఉన్నా పోలీసులు పట్టించుకోలేదని, తాను చనిపోతే కారణం ఎస్ ఐ అంటూ కంటతడి పెడుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.
Must Read : చిరు, నాగ్ లను కలిసిన సోహెల్ – ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
Sad if true. Constable Ganesh releases video where he accuses Tadipatri Rural SI Khaja Hussain of forcing him to work for long hours while he tested +ve for #COVID19. Says even SI didn't heed to his pleas for leave for 5 days. Any action taken @AnantapurPolice? #AndhraPradesh pic.twitter.com/kx64ne8zSq
— krishnamurthy (@krishna0302) April 25, 2021