శాంతిభద్రతలను పరిరక్షించడంలోనే కాదు… సమాజ సేవలోనూ మందుంటాం అంటున్నారు ఈ పోలీసులు. కుళ్లి పోయి దుర్వాసన వస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మూడు కిలోమీటర్లు మోసి మానవత్వాన్ని చాటుకున్నారు. విశాఖ జిల్లా రాంబిల్లి పరిధిలోని సీతపాలెం తీరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. ఎస్‌ఐ అరుణ్‌కిరణ్ కేసు నమోదు చేసి, ఇతర పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. అయితే మృతదేహం కోసం ఎవరూ రాలేదు. మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడం మొదలైంది. దీంతో బాడీని తరలించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఏఎస్‌ఐ దొర, హెచ్‌సీ మసేను, కానిస్టేబుల్ నర్సింగరావు, హోంగార్డు కొండబాబు కర్రల సాయంతో తీరం నుంచి మృతదేహాన్ని సీతపాలేనికి తీసుకొచ్చారు. తీరం నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు బాడీని మోశారు. ఆ తర్వాత పోలీసు వెహికల్ లో యలమంచిలిలోని మార్చురీకి తరలించారు. పోలీసులు బాడీని మోసిన ఫొటోలు వైరల్ కావడంతో పోలీసులు చూపిన మానవత్వ పట్ల ప్రజలు అభినందిస్తున్నారు. పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచిన సిబ్బందికి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సలాం చేశారు.
Must Read ;- డ్రిగ్రీ విద్యార్థిని దారుణహత్య!











