కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీ, రాజకీయ నాయకుల వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్ అని తేలింది. డాక్టర్ల సూచన మేరకు ఆయన టెస్ట్ చేయించుకోవడంతో స్వల్ప లక్షణాలు ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో రాహుల్ గాంధీ హోం ఐసోలేషన్ లో ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భార్య కూడా కరోనా బారిన పడ్డారు. కరోనా వైరస్ అంతటా తీవ్రరూపం దాల్చుతుంది. ఇక్కడా, అక్కడా… అంటూ తేడా లేకుండా విరుచుకుపడుతోంది. ఢిల్లీలో లాక్ డౌన్ విధించడంతో వలస కూలీలు, కార్మికులు ఇంటి బాట పడుతున్నారు. ఎవరికో ఏ లక్షణాలు ఉన్నాయో తెలియని పరిస్థితి దేశంలో నెలకొంది.
వాలంటీర్లు వద్దు.. లెంపలేసుకున్న వైసీపీ అధినేత.. జగన్ పీచే ముఢ్..?
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్కు జ్ఞానోదయం...