తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చెందిన విశాఖలోని భవనాన్ని జీవీఎంసీ సిబ్బంది కూల్చివేశారు. అయితే, ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఈ చర్యలకు దిగడంపై అధికారులను పల్లా నిలదీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నీ అనుమతులతోనే భవన నిర్మాణం చేపట్టామని, ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు పల్లా స్పష్టం చేశారు. బిల్డింగ్ కూల్చడానికి వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డే కారణమని ఆరోపించారు. గతంలో వైసీపీ పార్టీలోకి ఆయన నన్ను ఆహ్వానించారని, ఆయన ఆఫర్ ను తిరస్కరించినందుకే కక్ష కట్టారని పేర్కొన్నారు. పక్కా అనుమతులతోనే బిల్డింగ్ నిర్మించాలని, కావాలంటే దేవుడి మీద ప్రమాణం చేస్తానని పల్లా సవాల్ విసిరారు. ఒకవైపు ఏపిలో కరోనా కేసులు పెరుగుతుంటే, మరోవైపు ఈ అరెస్టులేంటి? అని జనాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Must Read : వైసీపీ కార్యకర్తల లైంగింక వేధింపులు : ఆశా వర్కర్ ఆత్మహత్యాయత్నం