కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని.. సోనూ సూద్ తెరమీద మాత్రమే విలన్ అని, నిజ జీవితంలో మాత్రం హీరో అని అందరికీ తెలిసింది. ఎంతో మంది వలస కార్మికుల్ని తమ స్వస్థలాలకు పంపించి.. మానవత్వాన్ని చాటుకున్నాడు. అలాగే.. ఎందరో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్స్ చేయించి.. వారి తల్లిదండ్రల పాటిట దేవుడయ్యాడు. అలాంటి సోనూసూద్.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. అవస్థ పడుతోన్న ఎందరో రోగులకు కూడా సాయం చేస్తూ.. నిత్యం వార్తల్లో ఉంటున్నారు.
అలాంటి సోనూ భాయ్.. రీసెంట్ గా తనకి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని, తాను హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని.. అయినా ఏం పర్వాలేదు.. దీని వల్ల తనకి సహాయం చేయడానికి మరింత సమయం దొరికిందని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేశాడు. అయితే ఆ పరిస్థితుల్లో కూడా .. ఆయన ఒక అమ్మాయికి కిడ్నీ సమస్య ఎదురైతే.. అప్పటికప్పుడు ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైద్రాబాద్ లో ట్రీట్ మెంట్ ఇప్పించి.. మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు.
ఇక ఇప్పుడు ఈ రోజు సోనూ.. తన అభిమానులు చాలా సంతోషంగా ఫీలయ్యే ఒక వార్తను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అదేంటంటే.. ఆయనకి కరోనా నెగెటివ్ వచ్చిందట. కొద్దిరోజులుగా హోం క్వారంటైన్ లో ఉండి.. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న ఆయన ఈ రోజు టెస్ట్ చేయించుకోగా.. నెగెటివ్ అని నిర్ధారణ అయింది. ఈ సందర్బంగా ఆయన తనకి నెగటివ్ వచ్చిందని ఒక ఫోటోతో సింబాలిక్ గా చెప్పారు. దాంతో ఆయన అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- యువతికి ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటుచేసిన సోనూ
Tested: COVID-19 Negative. pic.twitter.com/wF61zXVJ6m
— sonu sood (@SonuSood) April 23, 2021