రాష్ట్రంలో మెగా DSC నియామకాలు, ఉద్యోగాల కల్పనపై గత కొంతకాలంగా వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియా వేదికగా అసత్య ఆరోపణలు చేస్తున్న జగన్ బ్యాచ్‌కు లోకేష్ స్పష్టమైన డేటాతో చెక్ పెడుతున్నారు. అసలు వాస్తవాలు ఏంటో జనాల ముందుంచుతూ వైసీపీ ఆరోపణల్లోని డొల్లతనాన్ని ఎండగడుతున్నారు. ఐతే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మరో చర్చ నడుస్తోంది. గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన APPSC పరీక్షల లీకేజీలు, పేపర్ల వివాదాలు, భారీ స్కామ్‌లపై ఆయన ఎందుకు నోరుమెదడటం లేదనేది హాట్ టాపిక్‌గా మారింది.
జగన్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన వివిధ పోటీ పరీక్షలలో భారీగా అవకతవకలు జరిగాయని, నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడారనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. నిరుద్యోగ యువత ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యే గ్రూప్స్, ఇతర ఉద్యోగ పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వచ్చాయి. నిరుద్యోగుల పక్షాన పోరాడుతామని చెప్పే వారు, కేవలం రాజకీయ లబ్ది కోసం డీఎస్సీపై రోజుకో అబద్ధాన్ని ప్రచారం చేస్తున్న నాయకులు..మరి తమ అధికారిక హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ అక్రమాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు..? అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వస్తోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతను తీసుకురావడానికి, నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళికాబద్ధంగా నోటిఫికేషన్లు ఇస్తూ ముందుకు వెళ్తుంటే.. దాన్ని ఓర్వలేక వైసీపీ నేతలు కావాలనే అసత్యపు ప్రచారాలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుట్రలను మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ, అబద్ధాలు ప్రచారం చేసేవారికి తన కౌంటర్లతో సరైన సమాధానం ఇస్తున్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం యువత భావోద్వేగాలతో ఆడుకోవాలని చూసే వారికి లోకేష్ ఇస్తున్న కౌంటర్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇప్పుడు నిరుద్యోగులు అడుగుతున్న ప్రశ్న ఒక్కటే.. కేవలం అబద్ధాలతో డైవర్షన్ పాలిటిక్స్ చేసే బదులు, గతంలో జరిగిన APPSC స్కామ్‌లపై కూడా అదే స్థాయిలో స్పందించే దమ్ముందా? అని వైసీపీ నేతలను నిలదీస్తున్నారు. లోకేష్ లాంటి నాయకులు వాస్తవాలను సోషల్ మీడియా వేదికగా సమాజానికి వివరిస్తుంటే, తమ హయాంలోని తప్పులను కప్పిపుచ్పుకోవడానికి వైసీపీ చేసే కుట్రలు ఇకపై చెల్లవని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. యువత భవిష్యత్తును అడ్డుపెట్టి రాజకీయం చేయాలని చూసే వారికి రాబోయే రోజుల్లో నిరుద్యోగులే సరైన బుద్ధి చెప్పడం ఖాయం.











