విక్టరీ వెంకటేష్ – మెగా హీరో వరుణ్ తేజ్ – సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎఫ్ 3. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఎఫ్ 2 మూవీకి సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ సినిమా పై బిగినింగ్ నుంచి పాజిటివ్ టాక్ ఉంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. కరోనా కారణంగా షూటింగ్స్ కి బ్రేక్ పడడంతో ఎఫ్ 3 షూటింగ్ ఆగింది. ఇప్పుడు లాక్ డౌన ఎత్తేయడంతో తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఈ సాంగ్ లో ఇద్దరు హీరోయిన్లు నటించే ఛాన్స్ ఉందట. ఆ ఇద్దరు హీరోయిన్స్ బాలయ్య హీరోయిన్స్. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఎఫ్ 3 కోసం బాలీవుడ్ హీరోయిన్ సోనాలి చౌహాన్ ని ఆల్రెడీ ఫిక్స్ చేసారట. ఇప్పుడు మిగిలిన హీరోయిన్ ను కూడా ఫైనల్ చేసిన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరంటే.. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. సోనాలి చౌహాన్, ప్రగ్యా జైస్వాల్.. ఈ ఇద్దరూ ఈ సాంగ్ లో కనిపించనుందని సమాచారం. అయితే.. ఈ ఇద్దరు హీరోయిన్స్ బాలయ్య సినిమాల్లో నటించారు.
సోనాల్ చౌహాన్ బాలయ్య సరసన లెజెండ్ సినిమాలో నటిస్తే.. ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న అఖండ సినిమాలో నటిస్తుంది.ఎఫ్ 2 సీక్వెల్ అంటే..అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అయితే.. ఎన్ని అంచనాలతో వచ్చినా.. ఖచ్చితంగా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఎఫ్ 3 ఉంటుందని టీమ్ గట్టిగా చెబుతున్నారు. ఈ సినిమాని డిసెంబర్ లో విడుదల చేయనున్నట్టు సమాచారం.
Must Read ;- మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ.. బాలయ్య దర్శకత్వం?











