విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న వినోదాత్మక చిత్రం ‘ఎఫ్ 3’. బిఫోర్ లాస్టియర్ సంక్రాంతి కానుకగా వచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న ఎఫ్ 2 చిత్రానికిది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. అవే పాత్రలతో డిఫరెంట్ స్టోరీతో ప్రస్తుతం సెట్స్ మీదున్న ‘ఎఫ్ 3’ మూవీలో సునీల్ పాత్ర అదనంగా చేరింది. ఇక మొదటి భాగంలో కథానాయికలుగా నటించిన తమన్నా, మెహ్రీన్ లు సైతం రెండో భాగంలో అవే పాత్రలు పోషిస్తుండగా.. ఇందులో మరో హీరోయిన్ కూడా నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ‘ఎఫ్ 3’ మూవీలో బాలయ్య కథానాయిక సోనాలీ చౌహాన్ నటించబోతోందట. ఆ సినిమాలో నటించడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసిందట. ఆగస్ట్ 27న విడుదలకు సిద్ధం కాబోతున్న ఈ సినిమాలో సోనాలి పాత్ర చాలా పోష్ గా ఉండబోతుందని టాక్. ఎర్లియర్ బాలయ్య రూలర్ సినిమాలో కథానాయికగా నటిస్తోన్న గ్లామర్ గాళ్ సోనాలి చౌహాన్ కి ఎఫ్ 3 లో అనిల్ రావిపూడి ఎలాంటి పాత్రను డిజైన్ చేశాడో చూడాలి.
Also Raed :తెలుగులో వెంకీతో జీతూ ‘దృశ్యం 2’











