విక్టరీ వెంకటేష్ – మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న క్రేజీ మూవీ ఎఫ్ 3. ఎఫ్ 2 సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. అయితే.. కరోనా సెకండ్ వేవ్ రావడం.. అలాగే అనిల్ రావిపూడికి కూడా కరోనా రావడంతో షూటింగ్ బ్రేక్ పడింది. ఇప్పుడు కరోనా కేసులు తగ్గడం.. ఆల్రెడీ కొన్ని సినిమాల షూటింగులు స్టార్ట్ చేయడంతో ఎఫ్ 3 కూడా షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతుంది. సారధి స్టూడియోలో వేసిన ఒక ఓల్డ్ హౌస్ లో వెంకీ, వరుణ్ ల పై కొన్ని కామెడీ సీన్స్ చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఈ సినిమాని ఆగష్టు 27న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే.. లాక్ డౌన్ కారణంగా సమ్మర్ కి రావాల్సిన సినిమాలు ఆగిపోవడం తెలిసిందే. ఇప్పుడు సమ్మర్ కి రావాల్సిన సినిమాలన్నీ వరుసగా థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆగష్టు 27న విడుదల చేయాలనుకున్న ఎఫ్ 3 చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలి అనుకున్నారు మేకర్స్. ఇప్పుడు దసరాకి కూడా ఎఫ్ 3 రావడం లేదని తెలిసింది. విషయం ఏంటంటే.. వెంకటేష్ ఆగష్టులో విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారట. ఆయన వచ్చిన తర్వాత అంటే.. సెప్టెంబర్, అక్టోబర్ లో ఎఫ్ 3 కి సంబంధించి బ్యాలెన్స్ షూటింగ్ ప్లాన్ చేస్తారట.
అందుచేత ఎఫ్ 3 చిత్రాన్ని దసరాకి విడుదల చేయడం సాధ్యం కాదు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో లేదా.. సంక్రాంతి కానుకగా 2022 జనవరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. ఎఫ్ 2 సీక్వెల్ కాబట్టి ఎఫ్ 2 తో పోలిస్తే.. అంతకు మించి అనేలా ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని అంటున్నారు. మరి.. ఎఫ్ 3 అంచనాలను ఎంత వరకు అందుకుంటుందో చూడాలి.